పెళ్లికూతురైన ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత!‌

ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత, వ్యాపార‌వేత్త రామ్ వీర‌ప‌నేనితో నేడు వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో సంప్ర‌దాయ‌బద్ధంగా పెళ్లి కూతురుగా సునీత త‌యార‌య్యింది. పెళ్లి కూతురు అయిన సంద‌ర్భంగా కుటుంబ‌స‌భ్యుల‌తో ఆనందాన్ని పంచుకుం‌ది. ఈ క్ర‌మంలో త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి సంద‌డి చేసింది. నేడు రామ్‌తో ఏడ‌డుగులు వేయ‌నున్న సునీతకు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారు కాబోయే దంప‌తుల‌కు అడ్వాన్స్‌గా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

sunitha bridegroom photes

సునీత‌-రామ్‌ల ఇరు కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలో నేడు అతి కొద్దిమందితో ఘ‌నంగా వివాహం జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెళ్లికూతురైన సునీత ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సునీత‌కు 19ఏళ్ల వ‌య‌సులోనే పెళ్ల‌యిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక భ‌ర్త వేధింపులు భ‌రించ‌లేక ఆమె విడాకులు తీసుకున్నారు. ప్ర‌స్తుతం పిల్ల‌ల బాధ్య‌త‌ను ఆమే చూసుకుంటున్నారు. కొంత‌కాలంగా త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై ఎన్నో పుకార్లు వ‌చ్చినా సునీత వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇక వీట‌న్నంటిపై నేడు రెండో వివాహంతో చెక్ పెట్ట‌బోతుంది సునీత‌.