‘బిగ్ బాస్’ 4: హౌజ్ నుంచి వెళ్లిపోనున్న మొదటి కంటెస్టెంట్ అతడే?

దర్శకుడు సూర్య కిరణ్ బిగ్ బాస్ సీజన్ 4 నుండి ఎలిమినెట్ కాబోతున్న మొదటి కంటెస్టెంట్ అని తెలుస్తోంది. అతన్ని భవిష్యత్తు ఏమిటో శనివారమే అర్ధమయ్యింది. దాదాపు కంటెస్టెంట్స్ అందరూ అతనిపైనే ఫోకస్ పెట్టారు. ఇక ఎలిమినెట్ అయ్యే ఎపిసోడ్ ఆదివారం ప్రసారం చేయబడుతుంది. నిజానికి సూర్య కిరణ్ జనాలకు పెద్దగా తెలియదనే చెప్పాలి. తమిళ ప్రజలు అతనికి ఓట్ల ద్వారా మద్దతు ఇచ్చినా కూడా వర్కౌట్ కాలేదు.

సత్యం సినిమా దర్శకుడిని సూర్య కిరణ్ కొందరికి మాత్రమే తెలుసు. పైగా అతను హౌజ్ లో అందరిని కావాలని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కొంత వరకు అదే అతనికి నెగిటివ్ కామెంట్స్ ని అందించింది. కల్యాణి నామినేషన్లలోకి వస్తే అతని కాస్త సేఫ్ జోన్ లోకి వచ్చేవాడు, కాని ఆమె అదృష్టవశాత్తూ మొదటి వారంలో నామినేట్ అవ్వకుండా తప్పించుకుంది. సూర్య కిరణ్ నామినేట్ అయిన వారిలో అతి తక్కువ మంది ఇష్టపడే కంటెస్టెంట్స్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇక ఎలిమినేషన్స్ గంగవ్వా, అభిజీత్ మరియు సుజాత శనివారం ఎపిసోడ్లో సేవ్ చేయబడ్డారు. మరి ఈ రోజు హౌజ్ లో ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో చూడాలి.