టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ గాటు ప్రెస్ నోట్ తో మరోసారి వార్తల్లోకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించిన రామయ్య వస్తావయ్యా సినిమాకు హరీష్ శంకర్ దర్శకులుగా, చోట కే నాయుడు కొరియోగ్రాఫర్ గా పని చేసిన విష్యం అందరికి తెలిసిందే. అయితే చోట కే నాయుడు తన మీద కావాలని అభియోగాలను మోపుతున్నారు అని హరీష్ శంకర్ అన్నారు. అలాగే చోట కే నాయుడు ప్రస్తావన తాను ఎప్పుడు, ఎక్కడ తీసుకుని రాలేదని, అయినా చోట కే నాయుడు తనని ప్రతి ఇంటర్వ్యూ లో కావాలని టార్గెట్ చేసినట్లు మాట్లాడుతున్నారని ఆ ప్రెస్ నోట్ ద్వారా హరీష్ శంకర్ తెలిపారు. ఆ ప్రెస్ నోట్ లో హరీష్ శంకర్ ఇలా తెలిపారు….
(వయసులో పెద్ద కాబట్టి)
గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ.
రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు.
మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు
మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది కానీ రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్ ని తీసేస్తున్నాడు… అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మధనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే “గబ్బర్ సింగ్” వచ్చినప్పుడు నాది “రామయ్య వస్తావయ్య” వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా,
నా ప్రస్తావన రాకున్నా.
నాకు సంబంధం లేకున్నా.
నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు.
ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా. కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది.. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి.
ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.
కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే
any day any platform I AM WAITING
-భవదీయుడు హరీష్ శంకర్
వీరి మధ్య ఈ ఘర్షణ ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.