ఘనంగా “హరికథ” సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్

సరికొత్త కంటెంట్ ను ఎప్పటికప్పుడు ఓటీటీ లవర్స్ కు అందిస్తోన్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ “హరికథ” అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మ్యాగీ “హరికథ” సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి “హరికథ” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు “హరికథ” సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

రైటర్ సురేష్ జై మాట్లాడుతూ – కొన్నేళ్ల క్రితం నా మనసులో మొదలైన ఆలోచన ఇప్పుడు “హరికథ” సిరీస్ రూపంలో మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన హాట్ స్టార్ కు డైరెక్టర్ మ్యాగీ, పీపుల్ మీడియాకు థ్యాంక్స్. రాజేంద్రప్రసాద్ గారిని దృష్టిలో పెట్టుకునే ఈ కథను రెడీ చేశాను. మీ అందరికీ ఒక కొత్త అనుభూతిని కలిగించేలా సిరీస్ ఉంటుంది. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శశికిరణ్ నారాయణ మాట్లాడుతూ – ఈ రోజు “హరికథ” ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఈ స్టోరీ మా దగ్గరకు రెండేళ్ల క్రితం వచ్చింది. ప్యాషన్, హార్డ్ వర్క్ తో ఈ సిరీస్ చేశాం. మంచి టీమ్ తో వర్క్ చేసే అవకాశం “హరికథ” సిరీస్ తో దక్కింది. ఈ సిరీస్ కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. “హరికథ” కోసం మేమంతా ఎలా పనిచేశాం అనేది ఈ నెల 13న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో చూస్తారు. అని అన్నారు.

సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – “హరికథ” సిరీస్ కు వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. మ్యాగీ అన్న అద్భుతంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇటీవల కాలంలో నేను చూసిన వెబ్ సిరీస్ లలో ఒక మంచి స్టాండర్డ్ , క్వాలిటీతో ఉన్న సిరీస్ “హరికథ” అనిపించింది. ప్రతి సీన్ గొప్పగా తీర్చిదిద్దారు. “హరికథ” పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

డీవోపీ విజయ్ ఉలగనాథ్ మాట్లాడుతూ – నేను ఇప్పటిదాకా వెబ్ సిరీస్ లకు వర్క్ చేయలేదు. “హరికథ” నా ఫస్ట్ సిరీస్. ఈ సిరీస్ తో ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లబోతున్నారు మా డైరెక్టర్ మ్యాగీ. ప్రతి ఎపిసోడ్ ఒక బిగినింగ్, ఎండింగ్ తో ఉంటూ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ మాట్లాడుతూ – “హరికథ” పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఒక గొప్ప ప్రాజెక్ట్. హాట్ స్టార్ కు మరింత మంది ప్రేక్షకుల్ని దగ్గర చేస్తుంది. నా ఫేవరేట్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ గారితో ఈ సిరీస్ కు వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.

నటుడు ఎంఎస్ విక్రమ్ మాట్లాడుతూ – ఈ రోజు ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన అతిథులందరికీ థ్యాంక్స్. మంచి స్క్రిప్ట్ తో “హరికథ” వెబ్ సిరీస్ ను చేశాం. దేవుడి గురించిన కథ కాబట్టి ఆ దేవుడి మీద పూర్తిగా నమ్మకం ఉంచాం. తప్పకుండా మీ అందరినీ “హరికథ” ఆకట్టుకుంటుంది. ఈ నెల 13న “హరికథ” డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో చూడండి. అన్నారు

నటుడు గగన్ విహారి మాట్లాడుతూ – “హరికథ” లో లీడ్ రోల్ ను రాజేంద్రప్రసాద్ గారు తప్ప మరొకరు చేయలేరు అనిపించింది. ఆయనకున్న అనుభవం, పౌరాణికాల మీద అవగాహన, మాండలికం మీద పట్టు ఇవన్నీ..పర్పెక్ట్ గా ఈ పాత్రకు ఉపయోగపడ్డాయి. “హరికథ” ను తప్పకుండా హాట్ స్టార్ లో చూడండి. అన్నారు.

నటి ఉషా శ్రీ మాట్లాడుతూ – “హరికథ” సిరీస్ లో ఈరమ్మ క్యారెక్టర్ లో నటించాను. ఈరమ్మగా స్క్రీన్ మీద చాలా డిఫరెంట్ గా కనిపిస్తాను. ఈ సిరీస్ లో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. హాట్ స్టార్ కు, డైరెక్టర్ మ్యాగీకి థ్యాంక్స్. మా క్యారెక్టర్స్ అన్నీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – సినిమా ఇండస్ట్రీలో నాది 48 ఏళ్ల నట జీవితం. ఇంత సుదీర్ఘ కాలం నటుడిగా కొనసాగడం సాధారణ విషయం కాదు. ఎంతోమంది హీరోలతో కలిసి నటిస్తూ వస్తున్నాను. ఈ తరం హీరోలతో కూడా నటిస్తున్నాను. నటుడిగా నాకు ఇప్పటికీ “హరికథ” లాంటి గొప్ప స్క్రిప్ట్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సిరీస్ ను చూశాక థియేటర్ లో ఎందుకు రిలీజ్ చేయలేదు అని అడుగుతారు. ఈరోజు సినిమా థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది. అలాంటప్పుడు కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ను “హరికథ”లో చూపిస్తున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన రైటర్స్, డైరెక్టర్ మ్యాగీకి, మా పీపుల్ మీడియా సంస్థకు, హాట్ స్టార్ కు థ్యాంక్స్. ఏఎన్నార్, ఎన్టీఆర్ చేయాల్సిన రోల్ నాకు దక్కడం సంతోషంగా ఉంది. హరికథలు చెబుతూ జీవితాంతం హరి నామస్మరణ చేసే రంగాచారి పాత్రలో మీకు “హరికథ”లో కనిపిస్తాను. నటీనటులు శ్రీరామ్, దివి..ప్రతి ఒక్కరూ బాగా నటించారు. “హరికథ” టీమ్ అంతా ఫ్యాషన్ తో హార్డ్ వర్క్ చేశారు. “హరికథ”సిరీస్ ను మీరంతా ఎంతగానో ఇష్టపడతారు. అన్నారు.

ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – మా పీపుల్ మీడియా సంస్థలో వస్తున్న రెండో వెబ్ సిరీస్ “హరికథ”. శశి ఈ స్క్రిప్ట్ మా దగ్గరకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ ను ఆమె ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ స్క్రిప్ట్ ను సినిమాగా కూడా చేయొచ్చు. తెలుగు వెబ్ సిరీస్ లలో ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసేలా “హరికథ” ఉంటుంది. హాట్ స్టార్ ద్వారా ఈ సిరీస్ మీ ముందుకు వస్తుండటం హ్యాపీగా ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరికీ “హరికథ” నచ్చుతుంది. తెలుగులోనే కాదు ప్రతి భాషలోనూ ఆడియెన్స్ కు రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

డైరెక్టర్ మ్యాగీ మాట్లాడుతూ – “హరికథ” ప్రాజెక్ట్ డిస్కషన్స్ లో ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు నాతో చెప్పిన మాటేటంటే..నీకొక అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చా, రాజేంద్రప్రసాద్ గారి లాంటి గొప్ప నటుడిని ఇచ్చా, అంతే అద్భుతమైన ఔట్ పుట్ నువ్వు ఇవ్వాలి అన్నారు. బడ్జెట్ గురించి ఏ రోజూ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. సీజీ వర్క్ ఎంతో క్వాలిటీగా చేయించారు. విశ్వప్రసాద్ గారికి ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ స్క్రిప్ట్ చాలా వైవిధ్యమైనది, చాలా పెద్ద స్క్రిప్ట్. ఈ కథను వెబ్ సిరీస్ గా పర్పెక్ట్ గా చేయాలంటే దర్శకుడిగా నా ఒక్కడి వల్ల కాదు. నా యూనిట్ లోని ప్రతి ఒక్కరూ నాఅంత ప్యాషనేట్ గా వర్క్ చేసి సక్సెస్ ఫుల్ గా మీ ముందుకు వచ్చేలా చేశారు. అలా వర్క్ చేసిన నా టీమ్ అందరికీ థ్యాంక్స్. రాజేంద్రప్రసాద్ గారి తర్వాత నాకు బాగా నచ్చిన యాక్టర్ శ్రీరామ్ గారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. “హరికథ” సిరీస్ మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. అన్నారు.

నటి దివి మాట్లాడుతూ – “హరికథ”లో నటించే అవకాశం రావడం ఎంతో హ్యాపీగా ఉంది. ఈ సిరీస్ లో చామంతి అనే క్యారెక్టర్ లో నటించాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నా ఫేవరేట్ ప్రొడక్షన్ హౌస్. ఆ సంస్థలో వర్క్ చేసే అవకాశం రావడం, హాట్ స్టార్ తో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. “హరికథ” మా అందరికీ ఎన్నో మంచి మెమొరీస్ ఇచ్చింది. ఈ నెల 13న తప్పకుండా హాట్ స్టార్ లో మా “హరికథ” సిరీస్ చూడండి. అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ – “హరికథ” లాంటి గొప్ప సిరీస్ లో నటించే అవకాశం రావడం మాలాంటి యాక్టర్స్ కు ఒక బ్లెస్సింగ్ లాంటిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిజంగానే ఫ్యాక్టరీనే. ప్రాజెక్స్ వస్తూనే ఉంటాయి. వాళ్లు చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్ లో “హరికథ” కూడా ఒకటి. సముద్రం నుంచి ముత్యాలు దక్కించుకున్నట్లు మంచి స్క్రిప్ట్స్, ప్రాజెక్ట్స్ ను పీపుల్ మీడియా, హాట్ స్టార్ అందుకుంటాయి. “హరికథ”లో రంగాచారి, చామంతి, ఈరమ్మ..నేను చేసిన విరాట్ క్యారెక్టర్స్ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. “హరికథ”లో డివోషనల్, యాక్షన్, క్రైమ్, డ్రామా ప్రతి ఎలిమెంట్ లేయర్స్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ స్క్రిప్ట్ కు కనెక్ట్ అవుతారు. మా టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్. “హరికథ” ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. అన్నారు.

నటీనటులు – దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – కిరణ్ మామిడి
ఎడిటర్ – జునైద్ సిద్ధిఖీ
డీవోపీ – విజయ్ ఉలగనాథ్
మ్యూజిక్ డైరెక్టర్ – సురేష్ బొబ్బిలి
రైటర్ – సురేష్ జై
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – రామ్మోహన్ రెడ్డి, సుజిత్ కుమార్ చౌదరి కొల్లి, శశికిరణ్ నారాయణ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూఛిబొట్ల
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
డైరెక్షన్ – మ్యాగీ