YVS చౌదరి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

YVS చౌదరి. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఒక సినిమా రైటర్ గా, ఒక దర్శకునిగా, ఒక నిర్మాతగా, ఒక ఎక్సహిబిటర్ గా ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తిగా అందరికి గుర్తుండిపోయే వ్యక్తి. ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లాలోని గుడివాడ అనే ఒక చిన్న పట్టణం నుండి నుండి మొదలై ఈరోజు తెలుగు ప్రజలు అందరికి గుర్తుండిపోయే స్థాయికి ఎదిగిన వ్యక్తి YVS చౌదరి. ఈయన స్వర్గీయ నందముడి రామారావు గారికి వీరాభిమాని.

YVS చౌదరి 1998లో శ్రీ సీత రాముల కళ్యాణం చూద్దము రారండి అనే సినిమాతో దర్శకులుగా ఆరంగేట్రం చేసారు. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత నందమూరి హరికృష్ణ నాగార్జున లను హీరోలుగా సీతారామ రాజు అనే ఇనిమతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. యువరాజు సినిమాతో మహేష్ బాబు కు మంచి హిట్ ని అందించారు YVS చౌదరి. ఆ తరువాత ఆయన సొంతంగా బొమ్మరిల్లు వారి అనే ఒక నిర్మాత సంస్థను స్థాపించారు. లాహిరి లాహిరి లాహిరిలో అనే చిత్రం ఈ నిర్మాణ సంస్థలో నిర్మించారు. ఆ తరువాత సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, రేయ్ వంటి మరెన్నో సినిమాలు ఆయన దర్శకత్వం చేసారు. 2012 లో రవి తేజ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన నిప్పు సినిమా నిర్మించారు. అయితే త్వరలోనే ఆయన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నారు.