హన్సిక హీరోయిన్ గా రాజు దుస్స దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మాతగా సుమన్ సహ నిర్మాతగా రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 105 మినిట్స్. కొత్త ఎక్స్పెరిమెంటల్ గా మన ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం?
కథ : సింగిల్ క్యారెక్టర్ సింగిల్ షాట్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఎక్స్పెరిమెంటల్ మూవీగా ఈ సినిమా మన ముందుకు వచ్చింది. కథ విషయానికొస్తే హన్సిక ఒక బంగ్లాలో చిక్కుకుని అక్కడ జరిగిన సంఘటనలు ఎదుర్కొంటూ దాన్నుంచి ఎలా బయటపడింది అనేదే కథ. బ్యాక్ గ్రౌండ్ లో ఒక వాయిస్ వినిపిస్తూ హన్సిక ని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అసలా బంగ్లాలో ఏముంది హన్సిక ని ఇబ్బంది పెట్టింది ఎవరు? దాని నుంచి హన్సిక ఎలా బయటపడింది? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
వేరే క్యారెక్టర్స్ ఏమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్ తో సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. దర్శకుడు రాజు దుస్సా చేసిన ఎక్స్పరిమెంట్ సక్సెస్ అయింది.
టెక్నికల్ యాస్పెక్ట్ :
రాజుదుస్సా మొదటిసారి దర్శకత్వం చేస్తున్న చాలా బాగా తీశారు. సామ్ సి ఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఇంకా బాగా చిత్రీకరించవచ్చు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు. కిషోర్ బోయిదాపు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
హన్సిక 105 మినిట్స్ సినిమా మొత్తాన్ని తన భుజాల పైన వేసుకుని మోసింది. హన్సిక నటన అద్భుతంగా ఉంది. సింగిల్ క్యారెక్టర్ గా 105 మినిట్స్ మెప్పించడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో హన్సిక సక్సెస్ అయింది.
పాజిటివ్స్ :
- హన్సిక నటన
- రాజు దుస్సా దర్శకత్వం
నెగిటివ్ :
- గ్రాఫిక్స్
- కథలో బలం లేకపోవడం
ఫైనల్ వర్టిక్ట్ : ఒక థ్రిల్లింగ్ రైడ్ మరియు వన్ టైం వాచబుల్ గా 105 మినిట్స్