చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలిపిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పద్మవిభూషణ్ అవార్డు కు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు..

పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన వారి ప్రస్థానం రేపటి విశ్వంభరదాక విజయవంతంగా సాగుతుంది. వారు రక్తదానం, నేత్రదానం ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయారు.
చిరంజీవి గారిని ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు వరించిన సందర్భంగా వారికి నా తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు