హిరణ్యకశ్యప కంటే ముందే మరో లవ్ స్టోరీని సెట్ చేసుకున్న గుణశేఖర్

ఒక్కడు, చూడాలని వుంది, అర్జున్, రుద్రమదేవి వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న దర్శకుడు గుణశేఖర్ తన తరువాత సినిమాపై క్లారిటి ఇచ్చేశారు. దగ్గుబాటి రానాతో వెండితెరపై ‘హిరణ్యకశ్యప’లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూన్నట్లు వివరణ ఇచ్చారు.

శాకుంతలము అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్న ఈ దర్శకుడు హిస్టారికల్ లవ్ స్టోరీకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దుష్యంతుడు, శకుంతల భారతాన ఆదిపర్వంలోనే అతి ముఖ్యమైన అద్భుత కథ.
మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకం. మరి అలాంటి కథను గుణశేఖర్ ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి. నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన స్పెషల్ మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.