అక్టోబర్ 12 న ప్రారంభించబోయే గ్లోబల్ ఆన్‌లైన్ ఛారిటబుల్ ఆర్ట్ వేలం గురించి అందరికి తెలిసిందే. బ్యూటీ వితౌట్ బౌండరీస్ 2020తో భారతీయ నిరుపేద పిల్లల కళాకృతుల గ్లోబల్ ఆన్‌లైన్ వేలానికి వేయబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్ మరియు ప్రియాంక చోప్రా జోనాస్ మద్దతు ఇచ్చారు.
అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రాతో పాటు భర్త నిక్ జోనాస్, డాక్టర్ శశి థరూర్, మరియు డానీ బాయిల్ వంటి వ్యక్తులు ప్రతి 15 నిమిషాల ఆన్‌లైన్ సంభాషణను అత్యధిక బిడ్డర్లతో విరాళంగా ఇస్తారు. పిల్లలు సృష్టించిన 20 కి పైగా కళాకృతులు అక్టోబర్ 12న విక్రయించబడతాయి. బాల కళాకారులు 10 నుండి 17 సంవత్సరాల వయస్సు వరకు ఉంటారు. ఈ సేకరణలో వాటర్ కలర్ ల్యాండ్‌స్కేప్స్, పెన్-అండ్-ఇంక్ డ్రాయింగ్‌లు, మిశ్రమ మాధ్యమం మరియు బ్రష్ పెయింటింగ్‌లు ఎన్నో ఉన్నాయి, ఇవి లాక్‌డౌన్ సమయంలో తయారు చేసినట్లు తెలుస్తోంది.