‘గార్డ్’ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల

విరాజ్ రెడ్డి చీలం హీరోగా అను ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న యాక్ష‌న్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘గార్డ్’. జ‌గా పెద్ది ద‌ర్శ‌క‌త్వంలో అన‌సూయ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ‘రివేంజ్ ఫ‌ర్ ల‌వ్‌’ ట్యాగ్‌లైన్‌. మిమి లియోనార్డో, శిల్పా బాల‌కృష్ణ‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మెల్‌బోర్న్‌లో నివ‌సించే పాతికేళ్ల కుర్రాడైన సుశాంత్ సెక్యూరిటీ గార్డ్‌గా వ‌ర్క్ చేస్తుంటాడు. త‌ను క‌ష్ట‌ప‌డి సొంతంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీని స్టార్ట్ చేయాల‌ని అనుకుంటాడు. ఆ క్ర‌మంలో సామ్ అనే సైకాల‌జిస్ట్‌తో అత‌నికి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆమెతో ప్రేమ‌లో కూడా ప‌డ‌తాడు సుశాంత్‌. అనుకోని ప‌రిస్థితుల్లో అత‌ని జీవితం అనుకోని మ‌లుపు తీసుకుంటుంది. త‌న జీవితంలో ప్రేమ కోసం సుశాంత్ ఊహించ‌ని శ‌క్తుల‌తో ఎలాంటి పోరాటం చేశాడ‌నే క‌థాంశంతో రూపొందిన చిత్ర‌మే ‘గార్డ్‌’.

గురువారం గార్డ్ మూవీ మోష‌న్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. సెక్యూరిటీ గార్డ్ దుస్తుల‌తో హీరో విరాజ్ నిల‌బ‌డి ఉన్నారు. అత‌ని ప‌క్క‌న హీరోయిన్స్‌ మిమి లియోనార్డో, శిల్పా బాల‌కృష్ణ‌న్ నిల‌బ‌డి ఇన్‌టెన్స్ లుక్స్‌తో చూస్తుండ‌టాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ‘గార్డ్’ చిత్రం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోనే చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌తో పాటు ఇంగ్లీష్‌, చైనీస్ భాష‌ల్లోనూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామని, త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మార్క్ కెన్‌ఫీల్డ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

విరాజ్ రెడ్డి చీలం, మిమి లియోనార్డో, శిల్పా బాల‌కృష్ణ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: అను ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌: అన‌సూయ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: జ‌గా పెద్ది
సినిమాటోగ్ర‌ఫీ:  మార్క్ కెన్‌ఫీల్డ్‌
సంగీతం:  సిద్ధార్థ్ స‌దాశివుని
ఎడిట‌ర్‌:  రాజ్ మేడ‌
సాంగ్స్‌:  ప్ర‌ణ‌య్ కాలేరు
పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా