యాక్షన్ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్

యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా చాణక్య, తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. స్పై థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ సినిమా విడుదలకి ముందు పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. రిలీజ్ కి రెండు రోజుల ముందు సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న చాణక్య సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.

కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ కి యూ/ఏ లభించడం గొప్ప విషయమే. ఎన్ని ఫైట్స్ ఉన్నా, ఎంత యాక్షన్ పార్ట్ ఉన్నా వాటిని జస్టిఫై చేసే కథ ఉన్నప్పుడే యూ/ఏ సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ విషయంలో సక్సస్ అయిన చాణక్య చిత్ర యూనిట్, దసరా సీజన్ కి క్యాష్ చేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పుడున్న బజ్ కి పాజిటివ్ టాక్ కూడా తోడైతే చాణక్య సినిమా గోపీచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.