గోపీచంద్ స్పీడ్ పెంచాడు

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముహూర్తపు షాట్‌కి క్లాప్‌ కొట్టగా, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌, అనీల్‌ సుంకర, కె.కె. రాధామోహన్‌, యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాలో గోపీచంద్ పక్కన మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. హై బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సమంతతో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. మరి గతంలో గౌతమ్ నందా లాంటి సినిమాని ఇచ్చిన సంపత్ నంది, గోపీచంద్ ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకి వస్తారు అనేది చూడాలి.