జూనియర్ ‘ఎన్టీఆర్’ అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్!!

జూనియర్ ఎన్టీఆర్ ని వెండితెరపై చూసి చాలా కాలమవుతోంది. 2018లో అరవింద సమేత తరువాత మళ్ళీ మరో సినిమా చేయలేదు. ఎప్పుడైతే RRR కి ఒప్పుకున్నాడో తారక్ పూర్తిగా ఆ సినిమాకే పరిమితం అయ్యాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే హారిక హాసిని సంస్థకు చెందిన యువ నిర్మాత నాగ వంశీ ఒక క్లారిటీ ఇచ్చారు.. సినిమా అప్డేట్ కోసం అభిమానుల నుంచి చాలా కాలంగా సందేశాలు వస్తున్నాయని అయితే షూటింగ్ మొదలైన తరువాత అన్ని విషయాలు చెబుతామని ఈ నిర్మాత తెలియజేశాడు. అదే విధంగా షూటింగ్ మొదలుకాకముందే టైటిల్ ని బహిర్గతం చేయవద్దనే ఒక సెంటిమెంట్ ఉంది. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన అతిపెద్ద న్యూస్ రానున్నట్లు నాగవంశీ వివరణ ఇచ్చారు.