139మంది ‘అత్యాచారం’ కేసులో మరో ట్విస్ట్!!

ఇటీవల కాలంలో ఎలాంటి విపత్తులు చోటు చేసుకున్నా కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దానిపైనే ఓ వర్గం జనాలు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఇక ఎవరైనా సహాయం చేయకపోతే వారిని మరొక విధంగా టార్గెట్ చేయడం కామన్ అనే చెప్పాలి. ఇక ఏదైనా తప్పు చేశారని అనుమానం వస్తే చాలు నిజాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం కూడా చాలా మందికి అలవాటు అయ్యిందనే చెప్పాలి.

రీసెంట్ గా 139కేసుల వివాదం ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చాలా మంది సినిమాల వాళ్ళు తనపై అత్యాచారం చేశారని ఒక యువతి కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు పేరు కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడం ఒక విధంగా అందరిని షాక్ కి గురి చేసింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ కేసు విషయంలో మరొక ట్విస్ట్ బయటపడింది. బాధిత మహిళ ప్రదీప్ తో అలాగే సినిమా వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని ఒక వ్యక్తి బెదిరించడం వలనే అలా చేయాల్సి వచ్చిందని చెప్పడంతో విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. రాత్రి మొత్తం ట్రైనింగ్ ఇప్పించి తనతో ఆరోపణలు చేయించారని కూడా ఆ మహిళ మీడియాకు తెలిపింది. దీంతో సినిమా వాళ్ళు అంటే అంత చులకనగా కానిపిస్తున్నారా అనేలా కామెంట్స్ వస్తున్నాయి.