గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘శంకర్ గారు చేసిన స్నేహితుడు సినిమాకు గెస్టుగా వెళ్లాను. ఆ టైంలో ఆయనతో మాట్లాడేందుకు కూడా చాలా టెన్షన్ పడ్డాను. నాతో కాకపోయినా ఎవరితో అయినా సరే ఓ తెలుగు సినిమా చేయండని అడుగుదామని కూడా అడగలేకపోయాను. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. క్రికెట్‌కు సచిన్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్ గారు అలా.. డైరెక్టర్లకే డైరెక్టర్ ఆయన. అలాంటి శంకర్ గారితో పని చేయడం నా అదృష్టం. నా నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ మూవీ ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు. ఏం సాధించాలన్నా సహనం ఉండాలి. పుష్ప 2తో సుకుమార్ గారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అలాంటి సుకుమార్ గారు మా ఈవెంట్‌కు వచ్చి మాట్లాడటం ఆనందంగా ఉంది. దిల్ రాజు గారితో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘ఓవర్సీస్ ఆడియెన్స్ తెలుగు సినిమాల్ని ఎక్కువగా ఆదరిస్తుంటారు. వన్ నేనొక్కడినే మూవీని ఇక్కడి ఆడియెన్స్ ఆదరించి ఉండకపోతే నాకు నెక్ట్స్ సినిమాలు వచ్చేవి కావు. దిల్ రాజు గారు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. నన్ను నిలబెట్టినందుకు దిల్ రాజు గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. శంకర్ గారి చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్నాను. చిరంజీవి గారు ఎందుకు శంకర్ గారితో సినిమా చేయలేదు.. శంకర్ గారు ఎందుకు తెలుగు సినిమా చేయడం లేదు? అని అనుకునేవాళ్లం. కానీ శంకర్ గారితో రామ్ చరణ్ సినిమా అని తెలియడం తెగ ఆనంద పడ్డాను. ఈ విషయాన్ని రామ్ చరణ్ మొదటగా నాకే చెప్పినట్టున్నాడు. సూర్య తీసిన ఖుషి నాకు చాలా ఇష్టం. రైటర్‌గా వచ్చి డైరెక్టర్‌గా చేశా. ఖుషి సినిమాను రిఫరెన్సుగా పెట్టుకున్నాను. అంజలి మా ఊరు అమ్మాయి. చాలా బాగా నటించారు. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమన్ సాయం చేశాడు. కానీ అది నేను వాడుకోలేకపోయాను. ఓ హీరోతో సినిమా చేసినప్పుడు ఆ హీరోని ఎక్కువగా ప్రేమిస్తాను. రంగస్థలం అయిపోయాక కూడా ఆ అనుబంధం రామ్ చరణ్‌తో మాత్రమే కొనసాగింది. రామ్ చరణ్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాను. చిరంజీవి గారితో కలిసే ఈ గేమ్ చేంజర్ చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతం.. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్.. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్, ఫినామినల్.. జెంటిల్మెన్, భారతీయుడు చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశానో మళ్లీ అంతే ఎంజాయ్ చేశాను. రంగస్థలం తరువాత రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను. కానీ రాలేదు. ఇక గేమ్ చేంజర్ క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుంది’ అని అన్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘డల్లాస్‌లో ఈవెంట్ గురించి రాజేష్‌తో మాట్లాడాం. అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. ఈవెంట్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. 1998లో ఒకే ఒక్కడు సినిమాతో మా జర్నీ ప్రారంభం అయింది. శంకర్ గారు, చంద్రబాబు గారి చేతుల మీదుగా వంద రోజుల షీల్డ్ తీసుకున్నాం. శంకర్ గారు నిర్మించిన వైశాలి మూవీని తెలుగులో రిలీజ్ చేశాను. అలా శంకర్ గారితో జర్నీ చేస్తున్న మేం ఇలా గేమ్ చేంజర్‌ను నిర్మించాం. మా కో డైరెక్టర్ గారి ద్వారా శంకర్ గారు మాతో సినిమా చేయాలని, తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. అప్పుడే ఆర్ఆర్ఆర్ షూట్‌లో రామ్ చరణ్ ఉన్నారు. అప్పుడు ఈ కథ ఆయనకు చెప్పడం, నచ్చడం అలా జర్నీ మొదలైంది. మా బ్యానర్లో ఇది 50వ సినిమా. ఇంత పెద్ద బడ్జెట్‌తో నేను ఎప్పుడూ సినిమాలు తీయలేదు. కరోనా వల్ల కాస్త ఆలస్యం అయింది. డోప్ సాంగ్‌ను ముందుగా నేను ఫోన్‌లో చూశా. ఈ పాటను డల్లాస్‌లో రిలీజ్ చేస్తున్నామని తెలిసి నాకు సంతోషం వేసింది. ఈ పాటను చూసినప్పుడు నాకు కంట్లోంచి ఆనందబాష్పాలు వచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది. నేను చిరంజీవి గారి చిత్రాలను ఆడియెన్‌గా చూసి ఎంజాయ్ చేశా. కానీ తొలిప్రేమ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా ఎంజాయ్ చేశాను. కళ్యాణ్ గారితో సినిమా తీయడానికి నాకు చాలా టైం పట్టింది. మెగా ఫ్యామిలీతో ఉన్న బాండింగ్‌తో ఎవడు చేశాం. అది రిలీజై 11 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు గేమ్ చేంజర్‌తో మళ్లీ సంక్రాంతికి రాబోతోంది. ఈ సారి మామూలుగా కొట్టడం లేదు. గట్టిగా కొట్టబోతోన్నాం. శంకర్ గారి పాటలు, ఫైట్లు సెల్ ఫోన్‌లలో చూస్తే ఫీలింగ్ రాదు. వాటిని బిగ్ స్క్రీన్‌పైనే చూడాలి. ప్రతీ సాంగ్‌ను శంకర్ గారు అద్భుతంగా డిజైన్ చేసుకుంటారు. రా మచ్చా పాటను వైజాగ్, అమృత్ సర్‌లో 300 మందితో షూట్ చేశారు. నానా హైరానా పాటకోసం ప్రయోగాలు చేశారు. ఆ పాటను న్యూజిలాండ్‌లో షూట్ చేశారు. జరగండి పాట లీక్ అయింది. అందుకే హడావిడిగా రిలీజ్ చేశాం. కానీ శంకర్ గారు సంతృప్తి చెందలేదు. ఆ పాట ఏంటో మీకు థియేటర్లో తెలుస్తుంది. సాంగ్ వేనుమా సాంగ్ ఇరుక్కు.. ఫైట్ వేనుమా ఫైట్ ఇరుక్కు.. సంక్రాంతికి సూపర్ హిట్ ఇరుక్కు.. రామ్ చరణ్, సూర్య గారికి మధ్య జరిగే సీన్లు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ అంశాలు చాలా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ నాలుగేళ్ల క్రితం శంకర్ గారు రాసుకున్నారు. అవి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. శంకర్ గారి శిష్యుడని అనిపించుకుంటాడు. నా వెన్నంటి ఉండి నడిపిస్తున్న టీంకు థాంక్స్. శంకర్ గారే మా అందరినీ ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఓ తెలుగు సినిమాకు ఇలా మొదటి సారిగా ఇక్కడ ఈవెంట్ నిర్వహించి గేమ్ చేంజర్‌తో.. గేమ్ చేంజ్ చేశాం. సుకుమార్‌ని నేను పరిచయం చేయలేదు. మా ఇద్దరి జర్నీ ఒకేసారి ప్రారంభం అయింది. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ పెద్ద హిట్ కాబోతోంది. గేమ్ చేంజర్‌తో పాటుగా సంక్రాంతికి వస్తున్నాం తీసుకురమ్మని చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు సపోర్ట్ ఇచ్చారు. బాలయ్య బాబు డాకు మహారాజ్ చిత్రం కూడా రాబోతోంది. పండుగకు రాబోతోన్న అన్ని చిత్రాలు సూపర్ హిట్ అవ్వాలి’ అని అన్నారు.
స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు గారు చాలా బాగా మాట్లాడారు. సినిమా గురించి అంతా చెప్పేశారు. నేను ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాను. ఇక్కడకు రావాలా? వద్దా? అనుకున్నాను. కానీ మీ అందరి కోసం వచ్చాను. పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. కానీ అందులో కూడా నా మార్క్ ఉండాలని అనుకున్నాను. అలాంటి ఓ సినిమానే గేమ్ చేంజర్. తమిళంలో, హిందీలో చిత్రాలు చేశాను. కానీ నేను ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. అయినా మీరు నా మీద ప్రేమను చూపిస్తూనే వచ్చారు. చిరంజీవి గారితో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అది జరగలేదు. ఆ తరువాత మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాను. ఆపై ప్రభాస్‌తో కరోనా టైంలో చర్చలు జరిగాయి. కానీ వర్కౌట్ కాలేదు. రామ్ చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉంది. అందుకే ఈ గేమ్ చేంజర్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫీసర్, పొలిటీషియన్ మధ్య వచ్చే ఘర్షణ, వార్ మీదే ఈ చిత్రం ఉంటుంది. రామ్ చరణ్ గారు ఎంతో సటిల్డ్‌గా నటించారు. కాలేజ్ లుక్‌లో చాలా ఫైర్ ఉంటుంది. పంచెకట్టులో అప్పన్నగా అద్భుతంగా నటించారు. సాంగ్స్‌లో అదిరిపోయే స్క్రీన్ ప్రజెన్స్, అద్భుతమైన డ్యాన్స్‌లతో రామ్ చరణ్ మెస్మరైజ్ చేశారు. ఒక్కో సీన్, ఒక్కో డైలాగ్‌ను ఎస్ జే సూర్య ఎంతో అద్భుతంగా చేశారు. అంజలి గారు న్యాచులర్ యాక్టర్. సర్ ప్రైజ్ అండ్ షాకింగ్‌గా ఆమె పాత్ర ఉంటుంది. శ్రీకాంత్ గారు, బ్రహ్మానందం గారు, సునీల్ గారు,వెన్నెల కిషోర్ గారు ఇలా చాలా మంది సినిమా కోసం పని చేశారు. దిల్ రాజు అంతా తానై ముందుకు నడిపించారు. ప్రతీ రోజూ సెట్స్ మీదకు వచ్చి అన్ని పనుల్ని చక్కబెట్టేవారు. అదే ఆయన సక్సెస్ మంత్రం. కెమెరామెన్ తిరుతో ముందుగానే ఇన్ ఫ్రా రెడ్ టెక్నాలజీ గురించి చెప్పాను. డోప్ సాంగ్‌కి లక్షకు పైగా చిన్న చిన్న లైట్లను వాడాం. జరగండి పాట కోసం ఓ సెట్‌లో ఓ విలేజ్‌ను క్రియేట్ చేశాం. సాబూ సిరిల్ గారు అద్భుతంగా సెట్ వేశారు. తల తిప్పుకోనివ్వకుండా రూబెన్ ఈ మూవీని ఎడిట్ చేశారు. తెలుగు సినిమాలో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలని అనుకున్నాను. రెహమాన్ గారే నా సినిమాలకు సంగీతాన్ని ఇస్తుంటారు. తమన్ మీద చాలా బాధ్యత, ఒత్తిడి ఉండేది. కానీ ఆయన అద్భుతమైన పాటల్ని ఇచ్చారు. సుకుమార్ పుష్ప 2తో పెద్ద విజయాన్ని అందుకున్నారు. మా కోసం ఇక్కడకు వచ్చిన సుకుమార్ గారికి థాంక్స్. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు అద్భుతమైన విజయాన్ని అందుకోబోతోన్నారు. సోషియో, పొలిటికల్, మాస్ ఎంటర్టైనర్‌గా గేమ్ చేంజర్ రాబోతోంది’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ.. ‘శంకర్ గారితో పని చేసే ఛాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. పైగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో నాకు ఛాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇవన్నీ అనుకుంటే.. గేమ్ చేంజర్ అని టైటిల్ పెట్టడంతో మరింత ప్రెజర్ పెరిగింది. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు వస్తున్నాయి. అన్నీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి మాట్లాడుతూ.. ‘ఇంకా లోపలి రాలేక బయటే ఉన్నారు. వారందరికీ సారీ. ఇలా అమెరికాలో ఈవెంట్ చేయడం ఇదే మొదటి సారి. ఇది దిల్ రాజు గారి వల్లే సాధ్యమైంది. రామ్ చరణ్ గారు, శంకర్ గారు ఇలా అందరూ మన కోసం వచ్చారు. ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలి’ అని అన్నారు.
డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘శంకర్ గారి సినిమాలు చూస్తూ మేం పెరిగాం. పిఠాపురంలో పూర్ణ థియేటర్లో భారతీయుడు సినిమా చూశాను. కమర్షియల్ యాంగిల్స్‌లో సినిమా తీయడంలో శంకర్ గారు గ్రేట్. ఆయనలా ఇంకెవ్వరూ తీయలేరు. గేమ్ చేంజర్‌లో ఓ నాలుగు సీన్స్ చూశాను. అద్భుతంగా ఉన్నాయి. రామ్ చరణ్ గారు నన్ను బాగా అర్థం చేసుకుంటారు. నేను సమస్యలని చెప్పకపోయినా ఆయన అర్థం చేసుకుంటారు. మా గురువు గారిని దిల్ రాజు గారు డైరెక్టర్‌ని చేశారు. గేమ్ చేంజర్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ‘ఓ తెలుగు సినిమా ఈవెంట్ డల్లాస్‌లో జరగడం ఇదే మొదటి సారి. రామ్ చరణ్ గారు ఇక్కడకు వచ్చారు. అది డల్లాస్ ఆడియెన్స్ మీద ఆయనకున్న అభిమానం, ప్రేమ. ఇక డల్లాస్‌లో ఈవెంట్లు జరుగుతుంటాయి. దానికి ఇదే ప్రారంభం, ఆరంభం. సుకుమార్ గారు మన అందరినీ గర్వపడేలా చేశారు. మళ్లీ రామ్ చరణ్ గారి సినిమాతో అందరినీ గర్వపడేలా చేయండి. శంకర్ గారి సినిమాలంటే మాకు ప్రాణం. శంకర్ గారు మా అందరికీ స్పూర్తి. ఈ గేమ్ చేంజర్ అందరికీ గేమ్ చేంజర్ మూమెంట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
వెర్సటైల్ యాక్టర్ ఎస్.జె.సూర్య మాట్లాడుతూ .. ‘పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పేందుకు హైదరాబాద్‌కి మొదటి సారిగా వచ్చా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి. ఆర్‌సి ది కింగ్ అని నా ఫోన్‌లో సేవ్ చేసుకున్నాను. రామ్ చరణ్ రియల్ కింగ్. బిహేవియర్, డ్యాన్స్, స్టైల్, యాక్టింగ్ ఇలా అన్నింట్లో రామ్ చరణ్ కింగ్. గేమ్ చేంజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
హీరోయిన్ అంజలి మాట్లాడుతూ ‘‘ఫస్ట్ టైమ్ ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్‌లో, అది కూడా ఇంత మంది తెలుగు అభిమానుల మధ్యలో జరుగుతుండటం ఎంతో ఆనందంగా ఉంది. గేమ్ చేంజర్ మూవీలో నేను చేసిన పాత్ర.. నా కెరీర్‌లో బెస్ట్ రోల్‌గా నిలిచిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంత మంచి రోల్‌ను నాకు రాసిన శంకర్‌గారికి థాంక్స్. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి స్పెషల్ థాంక్స్. ఎస్‌వీసీని నా ఫ్యామిలీ ప్రొడక్షన్‌గా భావిస్తుంటాను. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, వకీల్ సాబ్ సినిమాలు చేశాను. ఇప్పుడు గేమ్ చేంజర్‌తో రాబోతున్నాను. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ను చాలా కొత్తగా చూడబోతున్నారు. అప్పన్న క్యారెక్టర్‌ను అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
గేమ్ చేంజర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. గేమ్ చేంజర్ చిత్రానికి సరిగమ ఆడియో పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
రామ్ చరణ్.. గేమ్ చేంజర్ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.యు.వెంకటేశన్, వివేక్ రైటర్స్‌గా వర్క్ చేశారు. హర్షిత్ సహ నిర్మాత. ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. నరసింహా రావు.ఎన్, ఎస్.కె.జబీర్ లైన్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా అవినాష్ కొల్ల, యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా అన్బరివు, డాన్స్ డైరెక్టర్‌గా ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వర్క్ చేస్తున్నారు. రామ్ జోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ పాటలను రాశారు.