నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే సందర్భంగా గేమ్ చేంజర్ చిత్ర బృందం ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు, ఆదిత్య రామ్, శిరీష్ నిర్మాణంలో అనిత సమర్పిస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తూ అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ ఈ చిత్రం రానుంది. తమన్ సంగీతాన్ని అందిస్తుండగా తీర్రు, రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ ఇంకా పాటలు ప్రేక్షకులను మెప్పించగా చిత్ర విడుదల దగ్గర పడుతున్న ఈ సమయంలో సినిమా నుండి ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్ర ట్రైలర్ అప్డేట్ విడుదల కావడం జరిగింది. రేపు సాయంత్రం 5:04కు ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానున్నట్లు చిత్ర బృందం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఎన్నో వంచనాలు ఉన్నాయి.