‘గాంధీ తాత చెట్టు’ సినిమా రివ్యూ

పద్మావతి మల్లాది రచన దర్శకత్వంలో తబితా సుకుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి ఎలమంచిలి, శేష సింధూరం నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా గాంధీ తాత చెట్టు. ఈ చిత్రంలో ప్రముఖ ఫ్యాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తూ తొలి పరిచయం కావడం జరిగింది. అలాగే భాను ప్రకాష్, ఆనంద చక్రపాణి, రాగ్ మయూర్, రఘురాం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రీ సంగీతాన్ని అందించగా శ్రీజిత్ చెరువుపల్లి, విశ్వ దేవబత్తుల సినిమాటోగ్రఫీ చేశారు. హరి శంకర్ టిఎన్ చిత్రానికి ఎడిటింగ్ పనిచేయటం జరిగింది. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
తెలంగాణ ప్రాంతంలో ఓ చిన్న పల్లెటూరి కథగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. సుమారు పదివేల క్రితం జరిగిన ఒక వింటేజ్ డాక్యుమెంటరీలో ఈ చిత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఓ కుటుంబంలోని తాత అలాగే తన మనవరాలు గాంధీ, వాడు పెంచుకున్న ఒక చెట్టు కథ ఇది. ఆ గ్రామానికి ఓ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నాన్ని చూపిస్తూ దానివలన మీరు కుటుంబంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఆ గ్రామ ప్రజలతో అలాగే గ్రామానికి వచ్చిన కష్టంతో వారు ఎలా పోరాడారు, అదేవిధంగా ఈ చిత్రంలో జాతిపిత అయినా మహాత్మా గాంధీ ఆలోచనలు ఎలా ఉపయోగపడ్డాయి అనే విషయాలను చూపిస్తూ సాగుతుంది. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు తెలియాలంటే కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటు నటన :
ఈ చిత్రంలో మొదలుగా చెప్పవలసింది సుకృతి వేణి నటన గురించి. తొలిచిత్రమైనప్పటికీ ప్రతి ఎక్స్ప్రెషన్ తో అలాగే ప్రతి ఎమోషన్ను సీన్ కు తగ్గట్లు క్యారీ చేస్తూ ఎంతో అద్భుతంగా నటించింది. సినిమా అంతట తానే కనిపిస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే తనే సినిమా అన్నట్లు ప్రతి విషయంలోనూ తన పాత్రకు న్యాయం చేసింది. అలాగే ఇతర నటీనటులు కూడా తమదైన పాత్రలో తాము నటిస్తూ చిత్రమంతా మంచి ఎమోషన్ క్యారీ చేస్తూ నటించారు. రాగ్ మయూర్ తన పాత్రకు తగ్గట్లు స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ తన ఉన్న కాసేపటి సమయంలో తనదైన మార్కును సాధించాడు. అలాగే గ్రామస్తులైన ఇతర నటీనటులు కూడా తమ పరిధిలో తాము నటిస్తూ చిత్రాన్ని ముందుకు తీసుకుని వెళ్లారు.

సాంకేతిక విశ్లేషణ:
డాక్యుమెంటరీ వంటి కథని తీసుకొని ప్రేక్షకులు ఎంతో ఎమోషనల్ గా కథను తాము ఓన్ చేసుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్లే విధంగా చిత్రాన్ని రచించుకోవడంలో అలాగే దర్శకత్వం నిర్వహించడంలో దర్శకురాలు పద్మావతి మల్లాది ఎంతో విజయం సాధించారు. ఎటువంటి వెనకడుగు వేయకుండా నిర్మాణ విలువలతో అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారు మైత్రి మూవీ మేకర్స్. అదేవిధంగా సినిమా అంతటా సీన్లకు తగ్గట్లు ఎంతో ప్రశాంతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అలాగే పాటలతో సంగీతాన్ని అందించడంలో రీ సక్సెస్ అయ్యారు. అదేవిధంగా సినిమాలో లొకేషన్స్ కూడా రియల్ లొకేషన్స్ కావడం ఎంతో నేచురల్ గా ఈ చిత్రం రావడానికి మడక ప్లస్ గా నిలిచాయి.

ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, లొకేషన్స్, సంగీతం, పాటలు, నటీనటుల నటన, బోనస్ గా సుకృతి వేణి నటన.

మైనస్ పాయింట్స్ :
కథ స్లోగా ఉండటం.

సారాంశం:
ఇటీవల రోజులలో ఇటువంటి ప్రశాంతమైన కుటుంబ సమేతంగా వెళ్లదగిన చిత్రాలలో ఒక మంచి మార్క్ సృష్టిస్తూ విలువలతో ఈ సినిమా రావడం జరిగింది. కాబట్టి కుటుంబ సమేతంగా వెళ్లి తప్పనిసరిగా చూడవలసిన చిత్రం.