“గేమ్ ఛేంజర్” టీం నుండి కియరాకు బర్త్ డే విషెస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియరా అద్వానీ హీరోయిన్ గా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్ప్స్ వీడియో ఇంకా ‘జరగండి జరగండి’ అంటూ వచ్చిన సాంగ్ ఇప్పటికే మంచి బజ్ తెప్పించింది. ఈ పాటకు తమన్ ఇచ్చిన సౌండ్స్ మరింత ప్లస్ గా మారింది. ఎస్ జె సూర్య, అంజలి, సముద్రఖని, నాస్సర్, జయరాం, సునిల్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్ ఇటీవలే జరిగిన కొన్ని వేరు వేరు ప్రెస్ మీట్లలో మాట్లాడిన మాటలు బట్టి చూస్తుంటే ఈ సినిమా రామ్ చరణ్ సినీ కరీర్లో గుర్తుండిపోయేలా ఉండబోతుంది అని అర్ధం అవుతుంది. దిల్ రాజు క్రిస్మస్ కు ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా గేమ్ ఛేంజర్ చిత్ర టీం కియరా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక స్పెషల్ బర్త్డే పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ లో కియరా అద్వానీ లుక్ ఇంకా కాస్ట్యూమ్స్ చూస్తుంటే ఇటీవలే ఈ సినిమా నుండి విడుదల అయిన ‘జరగండి జరగండి’ పాటలోని కియరా అద్వానీ సోలో స్టిల్ లా అనిపిస్తుంది. అయితే సినిమా టీజర్ అప్డేట్ కోసం రామ్ చరణ్ అభిమానులు వేచి చూస్తున్నారు.