చరణ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా, ఆ హిట్ మూవీకి సీక్వెలా?

కొన్ని సార్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతాయో తెలియదు. అవి ట్రోల్లింగ్ కి, ఫన్నీ కామెంట్స్ కి బాగా సెట్ అవుతూ ఉంటాయి. అలాంటి ఒక వార్తనే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ మూవీ గురించి వైరల్ అవుతూ ఉంది. శంకర్, చరణ్ కలయికలో rc 15 మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తోంది. ఈ విషయన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన ఫోటోలో శంకర్ వెనక రోబో ఉంది. ఈ రోబో బొమ్మనే ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవ్వడానికి రీసన్ అయ్యింది.

శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి రోబో మూవీ చేశాడు. రోబో, 2.0 భాగాలుగా వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1100 కోట్లు రాబట్టింది. ఇండియాన్ మూవీస్ లో టెక్నికల్ గా ఒక మాస్టర్ పీస్ అనే రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ మూవీ సొంతం. శంకర్ క్రియేటివిటీ అంతా రోబో సినిమాలో కనిపిస్తుంది. అంతటి విజువల్ వండర్ క్రియేట్ చేసిన శంకర్, తన నెక్స్ట్ సినిమాని రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఈ లేటెస్ట్ ఫోటోలో శంకర్ వెనక, రోబో ఫోటో ఉండే సరికి… శంకర్ – చరణ్ కలయికలో వచ్చేది రోబో 3.0 అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. జోక్స్ ఏ పార్ట్ శంకర్ చరణ్ మూవీకి రోబో సినిమాతో ఎలాంటి సంబంధం లేదు కానీ… శంకర్ తన మాస్టర్ పీస్ మూవీ పైన ఉన్న ప్రేమతో ఆ రోబో బొమ్మని ఆఫీస్ లో పెట్టుకోని ఉంటాడు.