ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ మొదటి పాట విడుదల

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూపా కొడువాయుర్ ఇందులో జంటగా నటించారు. ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ తరువాత శ్రీదేవి మూవీస్ – మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.

ఇందులో మొదటి పాట ‘సారంగో సారంగా’ ని నేడు ఆదిత్య మ్యూజిక్ ద్వారా సోషల్ మీడియాలో విడుదల చేశారు. విడుదలైన కాసేపట్లోనే వీక్షకులని, శ్రోతల్ని అమితంగా ఆకట్టుకోవడంతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ఈ పాట గురించి దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ “ఈ సినిమాలో కథానాయకుడు ప్రియదర్శి పేరు సారంగపాణి. అతని ప్రేమకథ నేపథ్యంలో వచ్చే పాట ఇది. ఓ రకంగా ఆ ప్రేమ కథకి మూలాధారం ఈ పాటే . నిత్యజీవితంలో తనకి తారసపడే వారితో సారంగపాణి తన ప్రేమని ఎలా ఆవిష్కరించాడో అన్నదే ఈ పాటలో ప్రధానం. హైదరాబాద్ లోని విభిన్న ప్రదేశాల్లో ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ లపై వినూత్నంగా చిత్రీకరించాం.ఈ పాట అర్మాన్ మాలిక్ గళంలో రామజోగయ్య శాస్త్రి పద చాతుర్యం కొత్త పుంతలు తొక్కినట్టుగా అనిపిస్తుంది. వివేక్ సాగర్ హాయైన స్వరాలతో ఈ పాటని తీర్చిదిద్దారు. ఇక సినిమాలో సరికొత్త ప్రియదర్శిని చూడబోతున్నారు” అని తెలిపారు.

ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ , నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె.మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.

మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల

కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్

కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్

మార్కెటింగ్: టాక్ స్కూప్

పీఆర్వో: పులగం చిన్నారాయణ

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్

కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్

పాటలు: రామ జోగయ్య శాస్త్రి

స్టంట్స్: వెంకట్ – వెంకటేష్

ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్

ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా

సంగీతం: వివేక్ సాగర్

లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక

సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి

నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్

రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి