శ్రీవిష్ణు, హసిత్ గోలీ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘రాజ రాజ చోర’తో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చారు. సైడ్- స్ప్లిట్టింగ్ ఎంటర్టైనర్ ‘శ్వాగ్’ కోసం వారు రెండుసారి చేతులు కలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్ సింగరో సింగను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ఫెస్ట్ ని ప్రారంభించారు, సోషల్ మీడియా సెన్సేషన్ అయిన సింగరేణి అకా సింగగా శ్రీ విష్ణు పాత్రను పరిచయం చేశారు.
వివేక్ సాగర్ ఎక్స్ ట్రార్డినరీ కంపోజిషన్, నిక్లేష్ సుంకోజీ ఆకట్టుకునే లిరిక్స్, బాబా సెహగల్, వైకోమ్ విజయలక్ష్మిల ఎనర్జిటిక్ వోకల్స్ పాట ఇన్స్టంట్ గా నచ్చేలా చేస్తుంది. ఈ పాటలో శ్రీవిష్ణు డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. ఇందులో విజువల్స్ అలరిస్తున్నాయి. హీరో పాత్రను పరిచయం చేయడంలో దర్శకుడు హసిత్ గోలీ క్రియేటివ్ ఐడియాని ఈ పాట అద్భుతంగా చూపిస్తుంది.
వింజమర వంశంలో క్వీన్ రుక్మిణి దేవి హీరోయిన్ గా రీతూ వర్మ నటిస్తున్నారు. వేదరామన్ శంకరన్ డీవోపీ కాగా, విప్లవ్ నైషధం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను నిర్వహిస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. శ్వాగ్ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం : హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నైషధం
ఆర్ట్ డైరెక్టర్: GM శేఖర్
స్టైలిస్ట్: రజనీ
కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్
స్టంట్స్: నందు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: భరణిధరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనునాగవీర
లిరిక్స్: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజీ, స్వరూప్ గోలి
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
కో-డైరెక్టర్: వెంకీ సురేందర్ (సూర్య)
VFX & DI: దక్కన్ డ్రీమ్స్
కలరిస్ట్: కిరణ్
VFX సూపర్‌వైజర్: వి మోహన్ జగదీష్ (జగన్)
కార్టూన్ అనిమే: థండర్ స్టూడియోస్
డైరెక్షన్ టీం: ప్రణీత్, భరద్వాజ్, ప్రేమ్, శ్యామ్, కరీముల్లా, స్వరూప్