రజనీకాంత్ సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం

లోకేష్ కననరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో కళానిధి మరన్ నిర్మిస్తున్న సినిమా కూలి. అక్కినేని నాగార్జున, శృతిహాసన్, ఉపేంద్ర, సౌభిన్ షాహిర్, సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఆనిరుద్ రవిచందర్ సంగీతం అవందిస్తుండగా గిరీష్ గంగదరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి వైజాగ్ లో షూటింగ్ జరుగుతుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీచ్ రోడ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా కంటైన టర్మినేటర్లో మంటలు చెలరేగాయి. లిథియం బ్యాటరీల లోడుతో వచ్చిన ఓ షిప్ లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో రజినీకాంత్ కూలి సినిమా యూనిట్ సభ్యులు తృటిలో తప్పించుకోవడం జరిగింది.