భూ కబ్జా కేసు లో సినీ నిర్మాత అరెస్ట్

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కల్వకుంట్ల తేజేశ్వరరావు ఈరోజు అరెస్ట్ అయ్యారు. షీ సినిమా కి నిర్మాతగా వ్యవరించిన కల్వకుంట్ల తేజేశ్వరరావు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారికి చాలా దగ్గర బంధువు కూడా. అయితే మన్నెగూడ భూవివాదం సంబంచిన విషయం లో కల్వకుంట్ల తేజేశ్వరరావు గారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే గత నెల 3వ తేదీన ఆదిభట్ల పీఎస్లో కన్నారావుపై కేసు నమోదైంది. మన్నెగూడలో రెండెకరాల భూమి కబ్జాకు యత్నించినట్లు కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి. తేజేశ్వరరావు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా హైకోర్టు తిరస్కరించడం జరిగింది.