చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదులోని శిల్పకళా వేడుక నందు ఆగస్టు 21 సాయంత్రం చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలకుగాను సినీ పరిశ్రమ నుండి ఎందరో ప్రముఖులు వచ్చి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలను చేయడం జరిగింది. అలాగే చిరంజీవి గారు వీరాభిమాని అయిన నటుడు, స్టంట్ మాన్ పొన్నాంబళం మాట్లాడుతూ ఇలా అన్నారు. “నేను ఇప్పటికే సుమారు 1500 సినిమాలకు ఫైట్స్ మాస్టర్గా చేశాను. అయితే ఒక పరిస్థితి లో ఘరానా మొగుడు సినిమా హిట్ కాకపోతే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోవలసి ఉంది. అటువంటి సమయంలో చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చి నా జీవితాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే సుమారు 1985-86 సమయంలో మాకు రోజువారి జీతం చొప్పున 350 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ ఒక్క చిరంజీవి గారి సినిమాకు మాత్రం ఒక్కొక్కరికి రోజుకు 1000 రూపాయలు ఇచ్చేవారు”.
“అంతేకాదు నాకు కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల ఆరోగ్యంగా చాలా దెబ్బ తిన్నాను. నా పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి గారు తన సొంత డబ్బులతో నాకు ఆపరేషన్ చేయించారు. అలాగే ఆ తర్వాత ట్రీట్మెంట్ కూడా చూపిస్తూ ఇప్పటికే సుమారు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈరోజు నేను మీ ముందు ఇలా ఉన్నానంటే దానికి కారణం చిరంజీవి గారు. నేను జీవితాంతం దీనికిగాను ఆయనకు రుణపడి ఉంటాను. నేను ఎప్పటికీ మీకు వీరాభిమానినే” అన్నారు.