ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు గారికి భార్య వియోగం

 Paruchuri Venkateswara Rao wife

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు గారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య పరుచూరి విజయలక్ష్మి కన్నుమూశారు. గత కొంత కాలంగా కొంత అస్వస్థతతో ఉన్న ఆమె కొద్దీ సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. 74ఏళ్ళ విజయలక్ష్మి మరణంతో పరుచూరి వారి ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ కి గురైంది.

పరుచూరి బ్రదర్స్ అంటే సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. చాలా మంది సినీ ప్రముఖులుకు వారి కుటుంబంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఇక పరుచూరి విజయలక్ష్మి అంటే కూడా సినిమా ఇండస్ట్రీలో అందరికి తెలిసిన వారే. ఇక అకస్మాత్తుగా ఆమె మరణించడంతో ఇండస్ట్రీలో కూడా అందరూ షాక్ అవుతున్నారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.