Bollywood: ప్రముఖ నటుడు రాహుల్‌దేవ్ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. రాహుల్‌దేవ్ ప్రతి నాయకుడి పాత్రలో మెప్పించిన ఆయన.. భార్య రీనా క్యాన్సర్ బారిన పడి 2009లో మరణించింది. వీరికి సిద్ధాంత్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భార్య మరణించిన తర్వాత కొంత కాలానికి ఓ పెళ్లిలో పరిచయమైన తనకంటే వయస్సులో 18ఏళ్లు చిన్న అయినా అమ్మాయితో సహాజీవనం చేస్తున్నాడు.
Bollywood ఆమె ఎవరంటే.. మోడల్, నటి ముగ్దా గాడ్సే. బాలీవుడ్ డైరెక్టర్ మాధుర్ భండార్కర్ తెరకెక్కించిన ఫ్యాషన్ చిత్రంలో ముగ్దా గాడ్సే నటించి బాలీవుడ్ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే గలీ గలీ చోర్ హై, విల్ యూ మ్యారీ మీ?. హీరోయిన్ వంటి పలు చిత్రాల్లో నటించారు. ఇక రాహూల్‌దేవ్(52)తో కొన్నేళ్లుగా ముగ్ధా సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమ బంధానికి త్వరలోనే ఎనిమిదేళ్లు నిండబోతున్నాయి. Bollywood ఈ నేపథ్యంలోనే ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముగ్దా గాడ్సే మాట్లాడుతూ.. రాహుల్‌దేవ్, తాను మా బంధం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు. మా ప్రేమకు ఇద్దరి మధ్య ఏజ్ సమస్య ఎప్పుడు రాలేదని.. దీనికి వివరణ కూడా ఇచ్చింది. భాగస్వామిని ఎంచుకోవడం అంటే షాపింగ్ చేయడం వంటది కాదు కదా.. నాకు ఈ కలర్ బ్యాగ్ నచ్చింది కాబట్టి కొనుగోలు చేశాను అన్నట్లుగా ఉండదు కదా.. ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలియదు. ఎవరికైనా ప్రత్యక్ష అనుభవంలోకి వస్తేనే ఈ విషయం అర్ధమవుతుంది. వయసుతో అసలు సంబంధం ఉండదని, ఇప్పుడు తమ జీవితం ఎంతో జాయ్‌ఫుల్‌గా నడుస్తుందని ముగ్ధా గాడ్సే చెప్పుకొచ్చారు.