బాలయ్య ను కలిసిన సినీ ప్రముఖ దర్శకులు

ఆంధ్ర ప్రదేశ్ 2024 ఎన్నికలలో హిందూపూర్ నుండి మూడవసారి ఎంఎల్ఏ గా గెలిచి అసెంబ్లీ కి వెళ్లనున్న నందమూరి బాల కృష్ణ గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కొంత మంది ప్రముఖులు స్వయంగా కలిసి అభినందించారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా బాలయ్య కు అనేక మంది ఇండస్ట్రీ ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేయగా ఈరోజు దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి కలిసి పూల బొకే తో శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రముఖ శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.