ప్రముఖ ‘హాస్య’ నటుడు ‘మృతి’!!

ప్రముఖ హాస్యనటుడు వాడివేల్ బాలాజీ అనారోగ్యంతో ఈ రోజు కన్నుమూశారు. గుండెపోటు రావడంతో గత కొద్ది రోజుల క్రితం ఈ నటుడు చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అతను పది రోజులకు పైగా చికిత్స తీసుకుంటున్నాడు. ఈ 42 ఏళ్ల నటుడు చికిత్స విఫలమవ్వడంతో ఈ రోజు మరణించాడు.

వడివేల్ బాలాజీ టెలివిజన్ షోలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను కొన్ని తమిళ చిత్రాలలో కూడా నటించాడు. వివేక్, ప్రసన్న, ఐశ్వర్య రాజేష్, శాంతను, వంటి ఇతర కోలీవుడ్ తారలు కమెడియన్ మరణంతో షాక్ అయ్యారు మరియు వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.