‘అఖిల్’ కోసం ‘రామ్ చరణ్’ సెట్ చేసిన స్టోరీ!!

మెగా ఫ్యామిలి అక్కినేని ఫ్యామిలీతో ముందు నుంచి కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. ఇక ప్రమోషన్స్ విషయంలో కూడా నాగ్ ఫ్యామిలీకి మెగా హీరోలు నిత్యం హెల్ప్ చేస్తూనే ఉంటారు. అఖిల్ హలో సినిమాకు మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా బాగానే కృషి చేశారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఏకంగా ఒక కథను సెట్ చేయిస్తున్నాడు.

సైరా సినిమా అనంతరం మరో స్టార్ హీరోతో సినిమా చేయాలని అనుకున్న సురేందర్ రెడ్డి ఆలోచన అఖిల్ వైపు మళ్లడానికి కారణం రామ్ చరణ్ అని తెలుస్తోంది. ఇన్నాళ్లకు అఖిల్ ఒక మంచి దర్శకుడి చేతిలో పడ్డాడని అభిమానులు సంబరపడుతున్నారు. మరి ఈ దర్శకుడితో అయినా అఖిల్ మాస్ హీరోగా బాక్సాఫీస్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. అఖిల్ నెక్స్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఆ సినిమాపై కూడా అంచనాలు భరిగానే ఉన్నాయి.