‘F2’ HINDI DUBBED MOVIE: హిందీలో కూడా సత్తా చాటిన ‘F2’

‘F2’ HINDI DUBBED MOVIE: వెంకటేష్-వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘F2’ హిందీలోనూ సత్తా చాటింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను ఆదిత్య మూవీస్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టింది. అయితే తాజాగా F2 హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించింది. దీనిని బట్టి చూస్తే హిందీ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుందని అర్థమవుతోంది.

F2 HINDHI DUBBED MOVIE

తెలుగులో F2 సూపర్ హిట్ కావడంతో.. అదే కాంబినేషన్‌లో F3ని కూడా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన F3 పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.