IFFI: 51వ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌.. విజేత‌లు వీరే!

IFFI: ఇంట‌ర్నేష‌నల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) 2021 వేడుక ఇటీవ‌లే గోవాలో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. గోవాలోని ఈ వేడుకను కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తుంది. ఈ వేడుక మొద‌టిరోజు కేంద్ర స‌మాచార‌, ప్రసారాల శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌, గోవా సీఎం ప్ర‌మోద్ సావ‌త్ అతిథులుగా పాల్గొని ఈ చ‌ల‌న చిత్రోత్స‌వాన్ని ప్రారంభించారు. ఈ నెల 16నుంచి ప్రారంభ‌మై.. ఇఫీ వేడుక‌ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగి నిన్న జ‌న‌వ‌రి 24తో ఈ వేడుక‌ను ముగించారు. ఈ ముగింపు వేడుక‌ల్లో..

IFFI:ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) యొక్క 51వ ఎడిషన్ తన గౌరవనీయమైన అవార్డు ప్రదానోత్సవాన్ని ఆదివారం ఈ వేడుక‌ ముగింపు రోజు గోవాలో నిర్వహించింది. ఈ నేప‌థ్యంలో డానిష్ రెండవ ప్రపంచ యుద్ధ నాటకం ఇంటు ది డార్క్నెస్ గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకోగా, ట్జు-చువాన్ లియు, జోఫియా స్టాఫీజ్ అగ్ర నటన గౌరవాలు పొందారు. ఈ క్ర‌మంలో ముగింపు వేడుకలో, 51వ ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చైర్మన్ పాబ్లో సీజర్ వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం పోటీలో ఉన్న చిత్రాలపై ప్రశంసలు కురిపించారు. పండుగ కోసం ఎంపిక చేసిన చిత్రాలలో ప్రదర్శించబడిన విస్తృత, వైవిధ్యమైన ఇతివృత్తాలతో మేము చాలా సంతోషంగా ఉన్నామని, ప్రత్యేకించి వ్యక్తిగత స్వేచ్ఛలు, పిల్లల హక్కులు, ఈ ప్రపంచంలోని ప్రజలందరినీ, మహిళల సాధికారత కోసం కొన్ని విషయాల జ్ఞాపకాలపై ప్రతిబింబించేలా చేస్తుంది. అలాగే విభిన్న క‌ళ‌ల‌ను ప్రోత్స‌హించే ఇలాంటి చిత్రోత్స‌వాలు రాబోయే త‌రాల‌కు స్ఫూర్తిగా నిల‌వాల‌ని, ఫిల్మ్‌ కంటెంట్‌తో పాటు సౌందర్య శోధనతో గొప్పగా ఉన్న చిత్రాల ఎంపికకు ధన్యవాదాలు IFFI అని సీజర్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ గ‌తేడాదే నవంబ‌ర్‌లోనే ప్రారంభం కావ‌ల్సి ఉంది.. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇక తెలుగు నుంచి కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గ‌తం సినిమా ఎంపికైన విష‌యం తెలిసిందే.. అలాగే త‌మిళం నుంచి కోలీవుడ్ స్టార్ ధ‌నుశ్ నటించిన అసుర‌న్‌, హిందీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన చిచ్చ‌ర్ ఎంపికైన వాటిలో ప్ర‌ధానంగా ఉన్నాయి.. మొత్తంగా 183 సినిమాలు ఎంపిక‌య్యాయి.