


నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘అగ్లీ స్టోరీ’. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘హే ప్రియతమా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇక ఈ “హే ప్రియతమా” సాంగ్ ఒక రొమాంటిక్ మెలోడీ.ఇది హృదయాన్ని తాకే ఎమోషన్స్‌తో నిండి ఉంది. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ ఈ పాటకి ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. కాలా భైరవ సింగింగ్ స్టైల్, అతని వాయిస్‌లోని డెప్త్ ఈ సాంగ్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. భాస్కరభట్ల రాసిన లిరిక్స్ సింపుల్‌గా ఉంటూనే లవ్‌లోని ఎమోషన్స్‌ని పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశాయి. “ప్రియతమా” అనే పదం చుట్టూ తిరిగే ఈ లిరిక్స్ యూత్‌కి కనెక్ట్ అవుతాయి.విజువల్స్‌లో శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ అద్భుతం. నందు, అవికా గోర్ జోడీ మధ్య కెమిస్ట్రీ సాంగ్‌కి లైఫ్ ఇచ్చింది. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ రొమాంటిక్ మూడ్‌ని మరింత ఎన్‌హాన్స్ చేసింది. రికార్డింగ్ క్వాలిటీ టాప్ నాచ్, ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని విన్నా, స్పీకర్స్‌లో విన్నా సౌండ్ క్లారిటీ సూపర్బ్ గా ఉందనే చెప్పాలి.టోటల్‌గా చెప్పాలంటే, “హే ప్రియతమా” ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ట్రాక్. ఇది లవర్స్‌కి, యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సాంగ్ రిపీట్ మోడ్‌లో పెట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు.
ఇక ఈ సినిమాలో శివాజీరాజా, రవితేజ మహదాస్యం, ప్రజ్ఞ లాంటి టాలెంటెడ్ కాస్ట్ నటిస్తున్నారు. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జె.ఎస్. సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ప్రణవ స్వరూప్ అందించారు. సినిమాటోగ్రఫీ శ్రీ సాయికుమార్ దారా, కొరియోగ్రఫీ ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్ శ్రీకాంత్ పట్నాయక్, సోమ మిథున్, ఆర్ట్ డైరెక్షన్ విఠల్ కోసనం, పీఆర్ఓ మధువీఆర్ లాంటి టీమ్ ఈ ప్రాజెక్ట్‌కి స్ట్రెంగ్త్ యాడ్ చేసింది.
బ్యానర్ : రియాజియా
ప్రొడ్యుసర్ : సుభాషిని, కొండా లక్ష్మణ్ .
హీరో ,హీరోయిన్ : నందు, అవికా గోర్, రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా మరియు ప్రజ్ఞా నయన్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రణవ స్వరూప్.
కెమెరా: శ్రీసాయికుమార్ దారా
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కరభట్ల
సింగర్ : కాల భైరవ
ఆర్ట్ డైరెక్టర్ : విఠల్ కోసనం
పి ఆర్ ఓ: మధు వి ఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం