సెమీ న్యూడ్ గా తెలుగు అమ్మాయి కనిపించే డేర్ చేస్తుందా?

లస్ట్ స్టోరీస్… హిందీలో తెరకెక్కిన సక్సస్ ఫుల్ వెబ్ సిరీస్. రాధికా ఆప్టే, కియారా అద్వానీలు ఈ లస్ట్ స్టోరీస్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే సిరీస్ ని తెలుగులో చేస్తున్నారు. అమలా పాల్ ఒక క్యారెక్టర్ చేయడానికి రెడీ అవ్వగా, మరో క్యారెక్టర్ లో ఈషా రెబ్బ యాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ షూట్ కూడా స్టార్ట్ అయ్యింది, ఇందులో నటిస్తుంది కాబట్టే ఈషా, తనకున్న తెలుగమ్మాయి అనే ట్యాగ్ చెరిపేసుకోవడానికి హాట్ ఫోటోషూట్స్ చేసింది. నెట్ లో ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.

ఫోటోషూట్స్ చేయడం వేరు, బోల్డ్ సిరీస్ లో నటించడం వేరు, అది కూడా లస్ట్ స్టోరీస్ లాంటి 18+ కంటెంట్ ఉన్న సిరీస్ లో నటించడం చాలా కష్టం. అక్కడ ఏమీ జరగదు కానీ జరిగినట్లు ఊహించుకోని ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం ఈషా ముందున్న సవాల్. ఈషా లస్ట్ స్టోరీస్ లో రాధికా ఆప్టే పాత్రలో నటిస్తుందో లేక కియారా అద్వానీ పాత్రలో నటిస్తుందో ఇంకా తెలియదు కానీ రెండు పాత్రల్లోనూ హాట్ సీన్స్ ఉన్నాయి. కియారా చేసిన అడల్ట్ సీన్స్ లో ఈషా నటిస్తుందా? లేక రాధికా ఆప్టేలా సెమీ న్యూడ్ గా కనిపించే డేర్ చేస్తుందా అనేది చూడాలి.