“ఈసారైనా?!” సినిమా రివ్యూ

విప్లవ్ స్వీయ నటన నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఈసారైనా?! ఈ చిత్రానికి సంకేత కొండ సహనిర్మాతగా ఉండగా గిరి డిఓపిగా పనిచేశారు. తేజ సంగీతం అందించిన చిత్రానికి గోరేటి వెంకన్న, రాకేందు మౌళి, శరత్ చేపూరి సాహిత్యం తోడైంది. విప్లవ్, అశ్విని జంటగా నటించగా మెహబూబ్ భాష, ప్రదీప్ రాపర్తి, సత్తన్న, అశోక్ మూలవిరాట్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో చెల్లాటిస్టులుగా కార్తికేదేవ్, నీతు సుప్రజ నటించడం జరిగింది. ఈ నెల 8న వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:
డిగ్రీ పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడే ఓ ఒకటి కథగా ఈ చిత్రం. డిగ్రీ పూర్తి చేసుకుని 4 సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతూ ఉంటాడు విప్లవ్. అప్పటికే మూడుసార్లు ప్రభుత్వం నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ప్రయత్నించగా విఫలమవుతాడు. అయితే ఆ సమయానికి అశ్విని అదే ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తుంది. వారి ప్రేమ గురించి తెలిసిన అశ్విని తండ్రి ప్రదీప్ తన కూతురును విప్లవ్ కు ఇచ్చి పెళ్లి చేయాలంటే అతడు ఈసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని శరతు పెట్టడం జరుగుతుంది. అయితే విప్లవ్ ఈసారైనా ప్రభుత్వ జీవితం సాధిస్తాడా? అశ్విని వివాహం చేసుకుంటాడా? చివరిగా ఏం జరుగుతుంది? అని తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

నటీనటుల నటన:
ఈ చిత్రంలో ముందుగా విప్లవ్ నటన గురించి చెప్పుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడే నేటి యువకులను ప్రతిబింబిస్తూ విప్లవం ఎంతో బాగా నటించడం జరిగింది. అదేవిధంగా అశ్విని మంచి స్క్రీన్ ప్లేసెస్ తో నటించడం జరిగింది. అదేవిధంగా అశ్విని తండ్రిగా నటించిన ప్రదీప్ అటు నవ్విస్తూ అలాగే ఇటు ఒక సీరియస్ క్యారెక్టర్ మైంటైన్ చేస్తూ ప్రేక్షకులను ఎంతదనో అలరించారు. మహబూబ్ బాషా హీరోకు స్నేహితుడిగా తనను సపోర్ట్ చేస్తూ తన పరిధిలో తను బాగా నటించాడు. అదేవిధంగా ఇతర క్యారెక్టర్లు చేసిన వారు కూడా తమ పాత్రలకు తగ్గట్లు న్యాయం చేయడం జరిగింది.

సాంకేతిక విశ్లేషణ:
విప్లవ్ తానే దర్శక నిర్మానుడిగా ఉంటూనే ఎడిటింగ్ ఇంకా ఇతర విభాగాలు కూడా విజయం సాధించారని చెప్పుకోవాలి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. చిత్తానికి తగ్గట్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే నీ న్యాచురల్ లొకేషన్ ను ఉండటంవల్ల ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రం ఉంది. స్క్రీన్ ప్లే ఇంకా కలరింగ్ కూడా చాలా బాగా వచ్చాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, మ్యూజిక్, డైలాగ్స్, నటీనటుల నటన.

మైనస్ పాయింట్స్:
తెలిసిన ఆర్టిస్టులు లేకపోవడం, మొదటి భాగం కొంచెం ల్యాగ్ సీన్లు ఉండటం.

సారాంశం:
నేటి యువతను ప్రతిబింబిస్తూ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి స్ఫూర్తినిచ్చే విధంగా అన్ని వయసులవారు చూసేలా ఈ చిత్రం ఉంది.