ప్రముఖ అనువాద మాటల రచయిత శ్రీ రామ కృష్ణ కన్నుమూత

అనువాద మాటల రచయిత శ్రీ రామకృష్ణ తన 74 ఏట కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా బాధపడుతున్న రామ కృష్ణ గారిని తేనాపేటలోని అపోలో హాస్పిటల్లో చేర్చగా రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన తన తుది శ్వాస విడిచారు. ఆయన సొంత ఊరు తెనాలి కాగా 50 సంవత్సరాల క్రితమే చెన్నైలో స్థిరపడిపోయారు. రామ కృష్ణ గారు ఎం ఏ పట్టాదారులు. ఆయన భార్య పేరు స్వాతి, కుమారుడు గౌతమ్.
ఆనయ మొత్తం 300 కు పైగా సినిమాలకు అనువాద రచయితగా పనిచేసారు. వాటిల్లో ముంబై, జెంటిల్మెన్, చంద్రముఖి వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. కాగా సమాజంలో స్త్రీ అనే సినిమాకి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు. మణిరత్నం, శంకర్ అన్ని సినిమాలకి ఆయనే మాటలు రాసేవారు. రజనికాంత్ గారి దర్బార్ సినిమాకి ఆయన చివరిగా మాటలు అందించారు.
రేపు ఉదయం సాలిగ్రామంలో ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నట్లు కొడుకు గౌతమ్ తెలిపారు.