కిరణ్ తిరుమలశెట్టి రచన దర్శకత్వంలో బసవరాజు లహరిధర్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ వసంత్ సంగీత దర్శకత్వం చేస్తూ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డ్రింకర్ సాయి. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరోయిన్ జంటగా నటిస్తూ శ్రీకాంత్ అయ్యంగర్, కిర్రాక్ సీత, సమీర్, రీతు చౌదరి, భద్రం, పోసాని కృష్ణ మురళి, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రం మంచి యూత్ ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ చిత్ర విశేషాలకి వస్తే….
కథ:
సినిమాలో ధర్మ టైటిల్ రోల్ ప్లే చేస్తూ మద్యపానానికి అలాగే ధూమపానానికి బాగా అలవాటు పడి ఎవరు చెప్పినా వినకుండా జీవితాన్ని తనతైన శైలిలో ఎంజాయ్ చేస్తూ ఉండగా తన జీవితంలోకి ఐశ్వర్య శర్మ వస్తుంది. ఐశ్వర్య శర్మ ఒక నాచురోథెరపీ చేస్తున్న విద్యార్థిని కావడంతో ఇటువంటి అలవాటులంటే అసలు ఇష్టం లేని క్యారెక్టర్. అయితే అటువంటి అమ్మాయి జీవితంలోకి హీరో ఎలా ప్రవేశిస్తారు? ప్రవేశించిన తర్వాత ఆ అమ్మాయి ఇతనిని యాక్సెప్ట్ చేస్తున్న లేదా? వారి ఇద్దరి మధ్య ఎటువంటి సంఘటనలు జరుగుతాయి? ఇతర క్యారెక్టర్లు వల్ల వీరి కథ ఎటువంటి మలుపులు తిరుగుతుంది? చివరగా వాళ్లు కలుస్తారా లేదా? చెడు అలవాటుల వల్ల హీరో ఏం కోల్పోతాడు? అసలు చివరి వరకు హీరో క్యారెక్టర్ సినిమాలో ఉంటుందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటులు నటన:
సినిమాలో ముఖ్యంగా హీరో క్యారెక్టర్ పోషించిన ధర్మ తన పూర్తి పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అదేవిధంగా ఎక్స్ప్రెషన్ల దగ్గర నుండి ఎమోషన్స్ వరకు ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తగా క్యారీ చేస్తూ డాన్స్ తో కూడా అదరగొట్టే స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. ఐశ్వర్య శర్మ తెలుగు అమ్మాయి కానప్పటికీ ఎక్కడ కూడా ఆ వ్యత్యాసం కనిపించకుండా తెలుగు అమ్మాయిలాగానే సినిమాతో తన క్యారెక్టర్ క్యారీ చేయడం జరిగింది. ప్రతి సీన్లను ఎంతో జాగ్రత్తగా నటిస్తూ వచ్చింది. అదేవిధంగా కిరాక్ సీత, ఫన్ బకెట్ రాజేష్, భద్రం వంటి వారు తమదైన కామెడీని పండిస్తూ థియేటర్లో మంచి సందడి చేశారు. రీతు చౌదరి తన పరిమితిలో తను నటిస్తూ తన క్యారెక్టర్ ముందుకు వెళ్లేలా చేశారు. అదేవిధంగా సమీర్, శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణ మురళి వారి పాత్రలకు టికెట్లు స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ సినిమాకు మంచి ఇంపాక్ట్ చూపిస్తూ నటించసాగారు.
సాంకేతిక విశ్లేషణ:
దర్శకుడు కిరణ్ తిరుమల శెట్టి మొదటిసారి దర్శకత్వం చేసినప్పటికీ ఎక్కడా కూడా దాఖలాలు కనిపించకుండా ఎంతో జాగ్రత్త పడి తన కథను పూర్తిస్థాయిలో స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తూ తనదైన స్టైల్ లో దర్శకత్వం చేస్తూ మంచి విజయం సాధించాలని చెప్పుకోవాలి. మొదటి భాగంతో పోలిస్తే ఇంటర్వెల్ తర్వాత రెండవ భాగం కొంచెం స్లోగా అనిపించినప్పటికీ క్లైమాక్స్ విషయంలో ఎంతో జాగ్రత్త పడుతూ అటు సెంటిమెంట్లు & ఎమోషన్స్ తోపాటు కామెడీ అలాగే మంచి డ్రామా సినిమా మొత్తం క్యారీ అయ్యేలా జాగ్రత్త పడటం జరిగింది. సెకండ్ హాఫ్ లో కొన్ని అవసరంలేని క్యారెక్టర్లు, అవసరం లేని సీన్లతో కొంచెం కామెడీ వర్కౌట్ కాకున్నప్పటికీ పూర్తి సినిమాతో పోలిస్తే ఎంతో ఎంటర్టైన్ చేస్తూ సినిమా ముందుకు సాగడం జరిగింది. పాటలు సందర్భానుసారంగా వస్తూ మంచి డాన్సింగ్ నెంబర్స్ తో ఎంటర్టైన్ చేశాయి. సీనులకు తగ్గట్లు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే వచ్చింది. అక్కడక్కడ కొంచెం డల్ అనిపించినప్పటికీ పూర్తి చిత్రం బావుంది అనే చెప్పుకోవాలి. కాస్ట్యూమ్ లు అలాగే డబ్బింగ్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారు స్పష్టంగా కనిపిస్తుంది. లిప్సింక్ ఏమాత్రం తేడా రాకుండా డబ్బింగ్ చూపించడం జరిగింది.
ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, పాటలు, హీరో నటన బోనస్ గా చెప్పుకోవచ్చు.
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉండటం, కొన్ని అవసరంలేని సీన్స్ & కామెడీలు.
సారాంశం:
మంచి సందేశం ఇచ్చే ఒక యూత్ ఫుల్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో వినోదపరుస్తూ విజయం సాధించింది.