మెగా డాటర్ నిహారిక-గుంటూరు ఐజీ కుమారుడు జోన్నలగడ్డ చైతన్య జంట పెళ్లి రాజస్థా ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు మెగా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. పెళ్లిలో డ్యాన్స్‌లతో మెగా ఫ్యామిలీ మాములుగా రచ్చ చేయలేదు. తన భార్యతో కలిసి చిరంజీవి డ్యాన్స్ చేయగా.. నిహారికతో చైతన్య చేసిన డ్యాన్స్ వీడియోలో యూట్యూబ్‌లో ట్రెండింగ్ సృష్టించాయి. ఇక పెళ్లిలో మెగా ఫ్యామిలీ అందరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ పెళ్లిలో మెగా ఫ్యామిలీ అందరూ ధరించిన డ్రెస్‌లు ప్రత్యేకతను చాటుకున్నాయి. రకరకాల సాంప్రదాయ దుస్తుల్లో మెగా ఫ్యామిలీ దర్శనమివ్వగా.. వీటిని డిజైన్ చేసేందుకు లక్షల్లో ఖర్చు అయిందని తెలుస్తోంది. పెళ్లిలో ప్రతి ఈవెంట్లోనూ మెగా కుటుంబ సభ్యులు అందరూ రకరకాల డిజైన్లు గల దుస్తుల్లో కనిపించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు వీటిని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
సంగీత్, మెహెందీ, పెళ్లి వేడుకల్లో రకరకాల దుస్తుల్లో మెగా ఫ్యామిలీ కనిపించింది. ఈ ఫంక్షన్లో మొత్తం 12 జతలు మార్చేశారని ఫొటోలను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇక అల్లు అర్జున్-స్నేహ, చరణ్-ఉపాసన జంటల ఈ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.