‘డబల్ ఇస్మార్ట్’ జెన్యూన్ రివ్యూ

పూరి జగన్నాథ్ దర్శక నిర్మాణంలో చార్మికౌర్, విష్ నిర్మాతలుగా ఉంటూ రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య తాపర్ ప్రధాన పాత్రలలో నటిస్తూ వచ్చిన చిత్రం డబల్ ఇస్మార్ట్. షిండే, టెంపర్ వంశీ, అలీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించడం జరిగింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఈ చిత్రం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడం జరిగింది.

కథ:

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఎలా అయితే ఒకరి జ్ఞాపకాలను, ఆలోచన శక్తిని మెడికల్ టెక్నాలజీ ద్వారా ఒక మనిషి నుండి మరో మనిషికి మారుస్తూ వచ్చారో అదే విధంగా ఈ సినిమాలో కూడా ఒకరి మెమరీను మరొకరికి ఆమచ్చడం అనే కాన్సెప్ట్ పై ఈ సినిమా ఉంటుంది. ట్రైలర్ లో చూపించినట్లుగానే సంజయ్ దత్ మెమరీ రామ్ పోతినేనికి అమర్చడం జరుగుతుంది. అయితే అసలు వీరి ఇద్దరి పరిచయం ఎలా ఉంటుంది, మెమరీ ట్రాన్స్ఫర్ సఫలం అవుతుందా లేదా? ఆ తరువాత శంకర్ కేరక్టర్ కు ఏం జరుగుతుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల నటన:

రామ్ పోతినేని తన నటనతో తన ఫాన్స్ ని పూర్తిగా సంతృప్తి పరిచారు. తన పాత్రకు తగ్గట్లు అటు శంకర్ గా అలాగే ఇటు సంజయ్ దత్ లా పూర్తిగా తన ఇరు పాత్రలకు న్యాయం చేశారు. హీరోయిన్ కావ్య థాపర్ సినిమాకు మంచి గ్లామర్ పాయింట్ మాత్రమే కాకుండా తనకు తగ్గ పాత్రలో నటిస్తూ మెప్పించారు. సంజయ్ దత్ తన పవర్ఫుల్ నెగెటివ్ రోల్ కు తగ్గ న్యాయం చేస్తూ నటించారు. అలాగే అలీ తనకు ఇచ్చిన బోక అనే ఓ సరికొత్త పాత్రలో నటిస్తు ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైనర్ చేస్తూ మంచి హాస్యం పండించారు. అలాగే సినిమాలోని ప్రతి ఒక్కరూ తమకు తగ్గ పాత్రలలో నటిస్తూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విశ్లేషణ:

పూరి జగన్నాథ్ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మొత్తం పూరి టేకింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాకు పాటలు పెద్ద ప్లస్ అని చెప్పుకోవాలి. అలాగే సినిమాకు తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ లోను మెప్పించింది. సినిమాకు తగ్గ కలర్ పూర్తిగా బ్యాలెన్స్ గా చూపించారు. సినిమా అంతటా మంచి నిర్మాణ విలువలతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకి ఎక్కించారు.

ప్లస్ పాయింట్స్:

నటుల పర్ఫార్మెన్స్, పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కథ

మైనస్ పాయింట్స్:

మొదటి భాగంలో కొంచం సాగతీత, కొన్ని అర్థం కానీ పదాలు

ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రేక్షకులు కచ్చితంగా పూర్తి వినోదాన్ని పొందే మంచి కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమా.