ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనపై వస్తున్న ఆరోపణలు విషయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… “ముందుగా వచ్చిన మీడియా వాళ్లందరికీ కొంత సమయం వెయిట్ చేయించినందుకు సారీ చెప్తున్నాను. నన్ను సపోర్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చినవారు అందరికీ నా ధన్యవాదాలు. నేను ఇప్పుడు ఏం మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి మీ ముందుకు రావడానికి కొంచెం లేట్ అయినందుకు మీ అందరికీ వెయిట్ చేయించినందుకు సారీ. నేను ఒక మాట కూడా అటు ఇటుగా పొగకూడదు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. అందరికి నమస్కారం. జరిగిన సంఘటన అనేది ఎవ్వరూ ఊహించని ఒక యాక్సిడెంట్. దీనిలో ఎవ్వరి తప్పులేదు. అక్కడికి వచ్చిన వారంతా ఒక మంచి ఉద్దేశంతో కూడుకుని సినిమా చూడాలి అని వచ్చినవారే. అక్కడ జరిగింది ఎవరు ఊహించని ఒక యాక్సిడెంట్. పోలీసులు రక్షణ ఇవ్వాలి అని, నేను మంచి సినిమా అందిస్తున్నాను అని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నవాళ్ళమే. ముందుగా ఆ కుటుంబానికి మనస్ఫూర్తిగా నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నా జీవితాశయం రషకులందరూ థియేటర్కు వచ్చి నవ్వుతూ తిరిగి ఇంటికి వెళ్లాలని. నాకు థియేటర్ అనేది దేవాలయం లాంటిది. అటువంటి థియేటర్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకంటే బాధపడేవారు ఇంకొకరు ఉండరు. ఆ బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అక్కడి బాలుడి ఆరోగ్య పరిస్థితిలో గంట గంటకి తెలుసుకుంటూనే ఉన్నాను. కొంచెం కొంచెంగా ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాడు అనే విషయం ఇన్ని బాధపడితే విషయాల మధ్యలో నాకు కొంత సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను ఇప్పుడు ఎవరిని దూషించడానికి ఇలా మాట్లాడటం లేదు. కానీ కొంత సమాచారం అనేది తప్పుగా ఉండటం లేదా కొంత అపార్థం చేసుకోవడం వలన కూడా కొన్ని తప్పిదలు జరుగుతాయి. నేను ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ను కానీ, ప్రభుత్వాన్ని కానీ, లేదా ఎవరైనా ఒక రాజకీయ నాయకుడిని పైన కానీ నింద మోపాలనుకోవడం లేదు. ఈ ప్రభుత్వం కూడా మాకు ఎంతో అండగా ఉంటూ సినిమా టికెట్ రేట్ల విషయంలో మాకు తోడుగా ఉంది. కొన్ని విషయాలు అపార్థం చేసుకోవడం వల్ల, అలాగే కొన్ని లేనిపోని బిందెలు వేయడం వల్ల నేను మానసికంగా ఎంతో ఒత్తిడికి లోనై, నా క్యారెక్టర్ పై మచ్చ పడటం చూస్తూ తట్టుకోలేక ఈ రోజు సంవత్సరంలో నేను ఎప్పుడైనా ఇలాంటివి చేశానా అనుకుని బాధపడ్డాను. ఇంత పెద్ద సినిమా చేసి, ఆ సినిమా ఇంత పెద్ద విజయం సాధించి కూడా నేను ఆ విజయాన్ని ఆనందించలేక పోతున్నాను. గత 15 రోజులుగా నేను ఎక్కడికి వెళ్లలేకపోతున్నాను. నా తప్పు లేకపోయినా నా చుట్టుపక్కల ఆ సంఘటన జరిగింది కాబట్టి నేను పూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. అలాగే నేషనల్ మీడియా ముందు నా గురించి అటువంటి మాటలు మాట్లాడటం నా క్యారెక్టర్ ను చంపేయడం వంటిది. అలాగే నేను నా సినిమా ఫంక్షన్స్ లో కూడా ఈ సినిమా తెలుగు వారి కీర్తిని పెంచే విధంగా ఉంటుందని అన్నాను. నాపై ఇటువంటి నిందలు పడటం చూసి ప్రజలకు నా గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి అని మాత్రమే ఇది అంతా చెప్తున్నాను. అంతేకానీ నేను ఎవరినో ఒకరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు. జరిగిన సంఘటనలు ఒక వరుసలో మాట్లాడుకుంటే ఈ సినిమా మూడు సంవత్సరాలు కష్టపడి చేశాము. అటువంటి సినిమా థియేటర్లో చూస్తేనే నాకు సినిమా ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. కోట్లు పెట్టి తీసిన సినిమా కాబట్టి ఆ సినిమా పై నాకు బాధ్యత ఉంటుంది. గత 20-30 సంవత్సరాలుగా నేను అదే థియేటర్ కు వెళ్తున్నాను. బాధ్యతారహితంగా నేను థియేటర్ కి వెళ్లాను, నాకు పర్మిషన్ లేకపోయినా నేను థియేటర్ కు వెళ్లాను అనేవి పూర్తిగా తప్పు. నేను వెళ్తున్నప్పుడు కూడా అక్కడ పోలీసులే అంత క్లియర్ చేస్తూ ఉన్నారు. వారి నేతృత్వంలోనే నేను ముందుకు వెళుతున్నాను. నాకు పర్మిషన్ లేకపోతే వారే వచ్చి చెప్పేవారు. నేను వెనక్కి వచ్చేసేవాడిని కానీ వారు మాకు మార్గాన్ని క్లియర్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళాను. నేను రోడ్ షో చేశానని ఒక ఆరోపణ చేస్తున్నారు. కానీ అక్కడ అటువంటిది ఏమీ జరగలేదు. మరికొన్ని అడుగుల దూరంలో థియేటర్ ఉంది అనగా జనాలు ఎక్కువగా గుమ్మి కోటడంతో కారు ఆగిపోవలసి వచ్చింది. అటువంటి సమయంలో ప్రజలు నేను బయటకి కనిపిస్తే గాని పక్కకు వెళ్ళరు. అటువంటి సమయంలో నేను కనిపిస్తే గాని ప్రజలు పక్కకి జరిగి మార్గాన్ని ఇవ్వరు అనే ఒక పరిస్థితిలో మాత్రమే నేను అలా బయటకు వచ్చి ఆ విధంగా అందరికీ చేయి ఊపడం జరిగింది. నన్ను చూడడానికి వచ్చిన వారి అందరిని అలా పలకరించడం నా బాధ్యత. కొంతమంది అభిమానాన్ని సంపాదించినందుకు సంతోష పడాల్సిన క్షణం అది. అలాగే నేను బయటకు కనిపించి అందరికీ థాంక్స్ చెప్తూ నమస్కారాలు పెట్టు ముందుకు వెళ్ళండి అంటూ సైగ చేస్తూ వచ్చాను. నేను అలా చేస్తేనే వారు ముందుకు వెళ్తారు. ఆ సమయంలో పోలీసులు, మేనేజ్మెంట్ ఇంకా అంతా కలిసి నన్ను మీరు చెప్తేనే వాళ్ళు వింటారు అని చెప్పడం వల్ల నేను కూడా అలా చేశాను. ఆ విధంగానే మేము థియేటర్లోకి వెళ్లాము. థియేటర్కు వెళ్లిన తర్వాత తప్పు సమాచారం అందింది పడుకోవచ్చు. అక్కడ రోడ్డు షో కానీ, ఇంకేమైనా గాని జరగలేదు. అలాగే సినిమా థియేటర్లోకి వెళ్లిన తరువాత పోలీసులు గాని, ఇంకెవరైనా కానీ నా వరకు ఎవరు రాలేదు. మా వాళ్లే బయట కొంచెం ఎక్కువ మంది జనం గుమ్ముగూడుతున్నారు కాబట్టి వెళ్లిపోండి అని చెప్పారు. బయట పోలీసులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తే మేము సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వెళ్ళిపోయాము. ఆ తరువాత రోజు నాకు ఇలా ఒక మహిళ పడిపోయారు, ఇలా చనిపోయారు అని తెలిసింది. ఆ తరువాత రోజు వరకు నాకు నిజంగా ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే నా భార్య బిడ్డలు కూడా నాతోనే ఉన్నారు. నాకు నిజంగా అక్కడ ఆ సమయంలో ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా అక్కడి నుండి వెళ్లిపోయి ఉండేవాడిని. ఎందుకంటే అది కనీస బాధ్యత. అటువంటిది నాకు తెలిసి కూడా నేను ఇంకా సినిమా చూస్తూనే ఉన్నాను అని నాపై ఆరోపణలు చేస్తే నాకు చాలా బాధ వేస్తుంది. నాకు అక్కడ అలా జరిగిందని విషయం అస్సలు తెలీదు. తర్వాత రోజు జరిగింది తెలిసిన వెంటనే చాలా షాక్ అయ్యాను. వెంటనే నేను మా బన్నీ వాస్ కు ఫోన్ చేసి అక్కడ ఏం జరిగిందో, ఎలా ఉందో తెలుసుకో నేను వెంటనే వెళ్లాలి అని అన్నాను. దానికి అతను నేను వెళ్లి చూసి మీకు చెప్తాను, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పటికైతే తెలియదు కదా అని అతనే వెళ్లారు. అక్కడికి వెళ్లడం బన్నీ వాస్ రాత్రి థియేటర్ దగ్గర ఇటువంటి సంఘటన జరిగింది, మీరు ఇక్కడికి వస్తే ఇది మరింత ప్రాబ్లం కావచ్చు కాబట్టి మీరు రావద్దు. ఇక్కడ జరగాల్సినవి అన్నీ అయిపోయిన తర్వాత నేనే వారిని మీ దగ్గరకు తీసుకొస్తాను అని చెప్పారు. అయితే అటువంటి సందర్భంలో ఆ కుటుంబం మీపై ఒక కేసు నమోదు చేయడం జరిగింది కాబట్టి చట్టపరంగా మీరు అక్కడికి వెళ్లడం తప్పు అని మా లీగల్ టీం నాకు చాలా స్ట్రిక్ట్ గా చెప్పడంతో నేను వారిని కలవకుండా, వాడి దగ్గరికి వెళ్లకుండా ఆగిపోయాను. సాధారణంగా మా కుటుంబానికి సంబంధించిన మెగా ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి ఫాన్స్ అలాగే కళ్యాణ్ గారి ఫాన్స్ కి ఏమైనా ఇబ్బంది కలిగితే నేనే స్వయంగా వెళ్లి కలిసి వచ్చిన వాడిని. అటువంటిది నా అభిమానులు నా పరిసర ప్రాంతాల్లో అటువంటి ఇబ్బంది పడి అలాంటి సంఘటన జరిగిందని తెలిస్తే నేను వెళ్ళనా? వారిని కలవాలి అని నాకు ఉండదా? అది కనీస బాధ్యత కదా. కానీ నేను వారిని కలవక పోవడానికి కారణం కేవలం ఆ సమయంలో అది చట్ట ప్రకారం కలవకూడదు కాబట్టి. అందుకే నేను వెళ్లలేకపోయాను. దానికి నేను ఈ సంఘటన స్పందించలేదు అనడానికి లేదు. వెళ్లకూడదు కాబట్టి వేరే దారి లేక అప్పటికప్పుడు ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. అప్పటికే నేను చాలా షాక్ లో ఉన్నాను. ఇప్పటికి కూడా నేను పూర్తిగా ఏకాగ్రతగా ఉండలేకపోతున్నాను. ఆ తర్వాత రోజు నేను ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. డబ్బు గురించి కాదు కానీ ఆ కుటుంబానికి ఏదో ఒకటి చేయాలి అని సదుద్దేశంతోనే వారికి అండగా ఉంటాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సినిమాకు సంబంధించి వేడుకలు ఏమి చేసుకోలేకపోయాము. ఇతర రాష్ట్రాలలో కూడా వేడుకలు చేయాలి అనుకున్న వాళ్ళము ఈ సంఘటన వల్ల వేడుకలు అన్ని ఆపేయడం జరిగింది. మా కుటుంబం నుండి ఎవరు వెళ్లి వారిని కలవకూడదు అంటే కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకుని వెళ్లి వారిని కలవండి అని నేనే చెప్పాను. అంతేగాని నేను వారి గురించి ఆలోచించకుండా లేను. నేను సాధారణంగా ఎటువంటి విషయాల్లో ఆయన గట్టిగా నిలబడేవాడిని కానీ ఇటువంటి సందర్భంలో అటువంటి ఆరోపణలు నేను తీసుకోలేక పోతున్నాను. నేను సినిమాలు చేసేదే మీరంతా థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటిది థియేటర్లో అటువంటి సంఘటన జరిగితే నేను ఎంతో బాధపడతాను! ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అందరూ చూస్తారని ఏదో ఒకటి చేసేలా కాకుండా ఆ బాలుడికి ఒక పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి చేద్దామని సుకుమార్ తో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆ బాలుడు నయం కావాలనుకుని, ఏ విధంగా వైద్యం చేస్తే మంచిది అనుకుని ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాము. అన్ని ఆలోచన చేసే నాపై నేను బాధ్యతగా లేను అని ఆరోపణ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు కూడా అదే వయసు పిల్లలు ఉన్నారు. వారికి ఏమైనా జరిగితే నేను అలాగే బాధపడతాను కదా. నేను ఒక తండ్రినే. నేను తెలుగువారి స్థాయి పెంచే విధంగా సినిమా తీశాను. నేను ఆ కుటుంబం గురించి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటాను. ఇప్పటికి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినా కూడా వారి దగ్గరికి నేను వెళ్తాను. అలాగే నేను బాధ్యతారహితంగా ఉన్నారు అనేది పూర్తిగా నూటికి నూరు శాతం తప్పు. అవి నాపై ఆరోపణలు మాత్రమే. నేను ఇప్పటికి కూడా ఎంతో బాధ్యతగా ఉన్నాను. నేను ఇప్పుడు మీడియా వారి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా తెలివిగా తప్పించుకునే ఉద్దేశంలో అయితే అసలు లేను. కానీ నా లీగల్ టీం నుండి చట్ట ప్రకారం కొన్ని హద్దుల మధ్య నేను మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నేను ఒక్క మాట అటు ఇటుగా మాట్లాడిన అది చట్ట ప్రకారం తప్పు అయితే తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది అనే కారణంతోనే నేనెప్పుడూ మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పాలి అనుకున్న ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాను. మీకు వేరే ఎటువంటి సమాధానం కావాలి అనుకుంటే మా లాయర్ అలాగే మా నాన్నగారు ఇక్కడే ఉంటారు. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. ఎంతసేపు నాకోసం ఎక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా థాంక్స్” అంటూ ముగించారు.