కార్తీ జ్యోతికతో కలిసి దొంగ అయ్యాడే…

సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న హీరో కార్తీ. రీసెంట్ గా ఖైదీతో మంచి హిట్ ఇచ్చిన కార్తీ, వదిన జ్యోతికతో కలిసి నటిస్తున్న సినిమా తంబీ. తెలుగులో దొంగ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ మూవీ టీజర్ బయటకి వచ్చింది. దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టీజర్ సినీ అభిమానులని ఆకట్టుకుంది. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ టీజర్, దొంగకి కావాల్సినంత పబ్లిసిటీ ఇచ్చింది. సెంటిమెంట్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రెండూ ఉండడం దొంగకి కలిసొచ్చే అంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాని వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.