‘దేవకీ నందన వాసుదేవ’ థియేట్రికల్ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే మొదటి రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

గుణ 369తో ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. శంకర్ పిక్చర్స్ ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుని, బిగ్గర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి హను మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.

ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా, సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌. దేవకి నందన వాసుదేవ మూవీ నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస

సాంకేతిక సిబ్బంది:
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్