‘బన్నీ’ ఐకాన్ సినిమా ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన ‘దర్శకుడు’!!

సుకుమార్ దర్శకత్వంలో హీరో అల్లు అర్జున్ తన 20వ సినిమా పుష్పాను ప్రారంభించటానికి త్వరలోనే సిద్ధం కానున్నాడు. షూటింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని టాక్ వస్తోంది. ఇక తరువాత తన 21వ చిత్రం కోసం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి పని చేయనున్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ఐకాన్‌ విషయం కూడా తెరపైకి వచ్చింది.

ఐకాన్ ప్రాజెక్టును కొంత కాలం క్రితం దిల్ రాజు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ బన్నీ త్రివిక్రమ్‌తో కలిసి అల వైకుంఠపురములో చేయాల్సి వచ్చింది. ఇక సుకుమార్‌తో వెంటనే పుష్ప కోసం కలిసి పనిచేయడంతో ఐకాన్ నిలిపివేయబడింది. ఒక తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, ఐకాన్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు అల్లు అర్జున్‌తో తన చిత్రం ఆగిపోలేదని వివరణ ఇచ్చాడు. అప్పుడప్పుడు స్టైలిష్ స్టార్‌తో టచ్‌లో ఉంటున్నట్లు వెల్లడించాడు. దీంతో ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక దర్శకుడు వేణు మెస్ట్ వకీల్ సాబ్ తో.ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.