‘డ్రగ్స్’ కేసు.. జైల్లోనే కన్నీరు పెట్టుకున్న హీరోయిన్ సంజనా!!

డ్రగ్స్‌ కేసులో ఇటీవల అరెస్టయిన కన్నడ నటీమణి సంజనా గల్రాని ప్రస్తుతం జైల్లో బోరున విలపిస్తోంది. చేసిన పొరపాటుకు ఆమె ఫలితం అనుభవించాల్సి వస్తోంది. సీసీబీ పోలీసులు ఇటీవల మడివాళ ఎఫ్‌ఎస్‌ఎల్‌ కార్యాలయానికి తీసుకువచ్చారు. మహిళా సీఐ అంజుమాల ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ సంజనాను విచారించారు.

దాదాపు 34 మంది పెద్ద పెద్ద వ్యక్తుల వారసుల పేర్లను సంజనా బయటపెట్టినట్లు తెలుస్తోంది. సినీ రంగానికి చెందిన ప్రముఖుల పేర్లను కూడా సీసీబీకి వెల్లడించిన్నట్లు సమాచారం. మహిళా సాంత్వన కేంద్రంలో రాగిణి ద్వివేదిని కూడా అనేక రకాలుగా ప్రశ్నించారు. నిందితుడు రాహుల్‌ ఇచ్చిన సమాచారంతో పాటు వివిధ కోణాల్లో లభించిన ఆధారలతో సంజనాను విచారించారు.
ఇక ఆమె చెబుతున్నదాంట్లో నిజమెంత అనేది పోలీసులు నిర్దారించుకోవాల్సి ఉంది. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే డ్రగ్స్ రియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.