‘బిగ్ బాస్’ లోకి కొత్త ‘కంటెస్టెంట్’.. ఎలిమినెట్ అయిన ‘దర్శకుడు’!!

బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి ఫస్ట్ వీక్ ఊహించని మలుపులతో మొదటి ఎలిమినేషన్స్ కి చేరుకుంది. ఇక అందరు ఉహీంచినట్టుగానే సత్యం దర్శకుడు సూర్య కిరణ్ అత్యదిక ఓట్లతో ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యాడు. చివరి రోజుల్లో కూడా అతనికి పెద్దగా మద్దతు లబించలేదు. దీంతో హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోక తప్పడం లేదు.

ఇక ఫైనల్ గా సూర్య కిరణ్ ఎలిమినెట్ కావడంతో మరో కొత్త కంటెస్టెంట్ గా ‘సాయి కుమార్ పంపన’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ రోజుల్లో, లవర్స్ వంటి చిత్రాల్లో కమెడియన్ గా క్లిక్కయిన ఈ కమెడియన్ గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేక సతమతమవుతున్నాడు. అందుకే ఫైనల్ గా బిగ్ బాస్ ద్వారా మళ్ళీ తన కెరీర్ ని సెట్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక పాపులర్ షో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగు పెట్టబోతున్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరో ఎలిమినేషన్స్ వరకు వెయిట్ చేయాల్సిందే..