‘మైక్రోసాఫ్ట్’కి షాక్ ఇచ్చిన టిక్ టాక్..?

ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న టిక్ టాక్ దెబ్బకు నాలుగు నెలల వ్యవవధిలోనే అగ్ర దేశాల ఆగ్రహానికి లోనై భారీ నష్టాలను ఎదుర్కోక తప్పలేదు. ఇండియాలో నిషేధించడంతో అమెరికా కూడా చైనా దేశానికి షాక్ ఇవ్వాలని టిక్ టాక్ కి ఒక గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే ముందు నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్ టాక్ ను కొనుగోలు చేసి అమెరికాలోనే కాకుండా భారత్ లో కూడా మళ్లీ రీ లాంచ్ చేయాలని అనుకున్నారు. కానీ టిక్ టాక్ యొక్క మాతృ సంస్థ బైటెడెన్స్ టిక్ టాక్ యొక్క యుఎస్ కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్ కు విక్రయించదని ఆదివారం రోజు క్లారిటీ ఇచ్చారు
మరో సంస్థ ఒరాకిల్‌కు టిక్ టాక్ ని విక్రయిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. నచ్చిన డీల్ ఆఫర్ చేయడం వల్లనే ఒరాకిల్ కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక మైక్రోసాఫ్ట్ ఆదివారం ఈ విషయంపై స్పందిస్తూ “జాతీయ భద్రతా ప్రయోజనాలను పరిరక్షించేటప్పుడు టిక్‌టాక్ వినియోగదారులకు మా ప్రతిపాదన బాగుండేదని నమ్మకంగా ఉంది” అని అన్నారు. భద్రత, గోప్యత, ఆన్‌లైన్ భద్రత మరియు తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవటానికి ఈ సేవ అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా గణనీయమైన మార్పులు చేసిందని కంపెనీ తెలిపింది.