నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా కల్కి 2898 AD. ఈ చిత్రంలో దీపికా పాడుకొనే, కమల్ హస్సన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల అయిన సినిమా టీజర్ & ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. బుజ్జి & భైరవ లను పరిచయం చేస్తూ చేసిన ఈవెంట్ మంచి బజ్ తెప్పించింది. అమెజాన్ విడుదల అయినా బుజ్జి & భైరవ అనిమేషన్ వీడియోలకు మంచి స్పందన లభించింది. నిన్న విడుదల అయిన భైరవ అంతెం సాంగ్ మంచిగా ట్రెండ్ అవుతుంది.
ఈరోజు ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ వీడియో ఒకటి వైజయంతి నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్ లో విడుదలచేయడం జరిగింది. ఆ వీడియో ద్వారా దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి సినిమా ఎలా ఉండబోతుందో వివరించారు. తనకు ఇష్టమైన సినిమాలు పాతాళభైరవి, భైరవాదీపం, ఆదిత్య369 నుండి హాలీవుడ్ సినిమాలు అయిన స్టార్ వార్స్ వంటి సినిమాలు చూసాం కానీ మన పౌరాణికాలు నుండి ఒక కథ ఎందుకు తీసుకోకూడదు అనిపించింది అన్నట్లు చెప్పారు. కృష్ణావతారం తరువాత వచ్చే 10వ దశావతారం కల్కి. ఈ అవతారం గురించి ఎలా ఉండబోతుంది అనేది చెప్పారు. అలాగే చివరికి ఎం జరుగుతుంది అంటూ వివరించారు దర్శకుడు నాగ్ అశ్విన్.