లోకనాయుకుడితో లోకేష్ కానగరాజ్ ‘గ్యాంగ్ స్టర్’ మూవీ…

ఖైదీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు లోకేష్ కానగరాజ్. రెండో సినిమానే దళపతి విజయ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘మాస్టర్’ సినిమాని విజయ్ ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చే రేంజులో తెరకెక్కించాడని సమాచారం. మాస్టర్ సినిమా పనులు కంప్లీట్ చేసిన లోకేష్ కానగరాజ్, తన నెక్స్ట్ సినిమాని లోకనాయకుడు కమల్ హాసన్ తో ప్లాన్ చేశాడు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ కమల్ హాసన్, లోకేష్ ఇద్దరూ ట్వీట్ చేశారు.

ఈ అనౌన్స్మెంట్ తో లోకేష్, సినిమా ప్రీ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఫుల్ గన్స్ తో, బ్లడ్ ని గుర్తు తెచ్చే రెడ్ కలర్ లో ఉన్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. Once Upon A Time There Lived A Ghost అని డిజైన్ చేసిన ఈ పోస్టర్ చూస్తుంటే కమల్ హాసన్ ఒక రూత్ లెస్ గ్యాంగ్ స్టర్ గా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. #KamalHaasan232 గా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ కానీ ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.