కోహ్లీ ట్వీట్… ‘ఆదిపురుష్’ కొంప ముంచిందా

బాహుబలి సాహో సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ ఓన్ చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తన మార్కెట్ రేంజుని మరింత పెంచుకుంటూ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్. తానాజీ ఫేమ్ ఓం రౌత్ డైరెక్ట్ చేయనున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రాముడిగా సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. రాముడు రావణుడు సరే అసలు సీత పాత్రలో ఎవరు కనిపిస్తారా అని ఆల్ ఇండియా మూవీ లవర్ వెయిట్ చేస్తుంటే బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఆదిపురుష్ లో నటించనుందనే న్యూస్ బయటకి వచ్చింది. ఆదిపురుష్ లో అనుష్క శర్మ సీతగా కనిపించనుందని అంతా ఫిక్స్ అయ్యే లోపు ఆమె ప్రెగ్నెంట్ అంటూ ఒక ఫోటో రిలీజ్ చేసి విరాట్ కోహ్లీ పెద్ద బాంబే పేల్చాడు. 2021 జనవరిలో అనుష్క బిడ్డకి జన్మనివ్వబోతోంది అని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

ఒక హిందీ వెబ్ సైట్ లో రాసిన ఆర్టికల్ ప్రకారం… ప్రెగ్నెంట్ గా ఉన్న అనుష్క ఆదిపురుష్ లో నటించే అవకాశం లేదు. జనవరిలో బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత అనుష్క తన రీఎంట్రీని గ్రాండ్ గా స్టార్ట్ చేయాలనుకుంటుందట. అందుకు తగ్గ కథలని ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని లూప్ లైన్ లో పెట్టిందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అనుష్క శర్మ 2021 ఏప్రిల్ నుంచి మళ్ళీ షూటింగ్ కి వెళ్తుంది కానీ అది ప్రభాస్ ఆదిపురుష్ కి మాత్రం కాదు.

70 రోజుల్లో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేస్తానన్న డైరెక్టర్ ఓం కూడా అనుష్క వచ్చే వరకూ వెయిట్ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఆదిపురుష్ ని వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు కాబట్టి ఆలోపే సీత రోల్ ప్లే చేయబోయే ఫిమేల్ లీడ్ ని ఫైనల్ చేస్తారేమో చూడాలి.