శ్రీరామ్, రితికా సింగ్ ప్రధాన పాత్రలలో నటించిన యూనిక్ హారర్ మూవీ ‘వళరి’. ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో మార్చి 6వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపధ్యం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిధిగా ‘వళరి’ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
‘వెంకటాపురం బంగ్లా డీటెయిల్స్ కావాలి’.. ‘ఆ బంగ్లా గురించి మీకు తెలుసా?’ ‘అది దెయ్యాల కొంప’.. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. రితికా సింగ్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేసింది. శ్రీరామ్ పాత్ర కూడా కీలకంగా వుంది. దర్శకురాలు మృతిక సంతోషిణి చాలా గ్రిప్పింగ్ నేరేషన్ తో ఈ సినిమాని రూపొందించారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. కెమరాపనితనం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ..‘వళరి’ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ట్రైలర్ లో కట్స్ చాలా బావున్నాయి. చాలా క్రియేటివ్ గా వుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దర్శకురాలు సంతోషిణి కి అభినందనలు. ‘వళరి’ టైటిల్ ఆకట్టుకునేలా వుంది. ఒకవైపు రాజమౌళి గారితో పని చేసిన ఎడిటర్ తమ్మిరాజు గారు ఈటీవీలో పని చేసిన కృతజ్ఞతతో ఈ సినిమాకి పని చేయడం ఆయన డెడికేషన్, ప్యాషన్ ని తెలియజేస్తుంది. రామోజీ సంస్థల నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా అది తెలుగువారింట్లో ఒక స్థానం సంపాదించుకుంటుంది. ఇప్పుడు సాలిడ్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. రామోజీ సంస్థ నిర్మించిన ఓ సినిమాకి గెస్ట్ గా రావడం గర్వంగా భావిస్తున్నాను. శ్రీరామ్ అప్పటికి ఇప్పటికీ ఒకేలా వున్నారు. ట్రైలర్ లో రితికా నటన అద్భుతంగా వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్ తో కలసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను. మార్చి 6న ఈటీవీ విన్ లో ‘వళరి’ని మిస్ కావద్దు” అన్నారు.
దర్శకురాలు ఎం మృతిక సంతోషిణి మాట్లాడుతూ.. రితికా సింగ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సినిమాకి బలం తీసుకొచ్చారు. శ్రీరామ్ గారితో పని చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఉత్తేజ్ గారు, సుబ్బరాజు ఇలా అందరితో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తమ్మిరాజు గారు నా సినిమాకి ఎడిటర్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయిబాబు గారికి ధన్యవాదాలు. ‘వళరి’ అనేది ఒక ఆయుధం. ఒక బూమరంగ్ లా పని చేస్తుంది. మనం ఏం చేసిన కర్మ తిరిగి మన వద్దకే వస్తుంది. ఇందులో రితికా పాత్రకు ‘వళరి’అనేది యాప్ట్ టైటిల్. ఈ సినిమా నిర్మాణంలో నిర్మాతలు చాలా స్వేఛ్చ ఇచ్చారు. బాపినీడు గారికి ధన్యవాదాలు. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. సుబ్బరాజు, ఉత్తేజ్, తమ్మిరాజుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.
రితికా సింగ్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. ఈ సినిమా వండర్ ఫుల్ జర్నీ. ఇది నా ఫేవరేట్ కథ. దర్శకురాలు సంతోషిణి చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాతో తనకి చాలా మంచి పేరు వస్తుంది. ఇందులో నా పాత్రలో చాలా లేయర్స్ వున్నాయి. శ్రీకాంత్ గారు, సుబ్బరాజు గారు, ఉత్తేజ్ గారు లాంటి నటులతో పని చేయడం గొప్ప అనుభవం. నిర్మాతలకు ధన్యవాదాలు. మా ట్రైలర్ ని లాంచ్ చేసిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. మార్చి 6నఈటీవీ విన్ లో అందరూ తప్పకుండా చూడాలి’ అని కోరారు.
శ్రీరామ్ మాట్లాడుతూ..దర్శకురాలు సంతోషిణి చాలా క్లారిటీ ఈ సినిమా తీశారు. ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. రితికా సింగ్ చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా కోసం తను ఫైట్స్ ని చాలా సహజసిద్ధంగా చేశారు. చాలా అంకిత భావంతో పని చేశారు. ‘వళరి’లో చాలా పాత ఆయుధాలని వాడటం జరిగింది. ఈ కథ, కథనం ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. మా ట్రైలర్ ని లాంచ్ చేసిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. మార్చి 6నఈటీవీ విన్ లో అందరూ ఈ సినిమా చూడాలి’ అని కోరారు.