మరో వివాదంలో క్రాక్.. నిర్మాతపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఫిర్యాదు

‘క్రాక్’ నిర్మాత ఠాగూర్ మధుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్థిక వ్యవహారాల కారణంగా క్రాక్ విడుదల రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక తమ సినిమా బాగానే ఆడుతున్నా.. తమ సినిమాను థియేటర్లలో తీసివేసి మాస్టర్ సినిమాకు థియేటర్లకు ఇస్తున్నారంటూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై క్రాక్ నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఫైర్ కావడం టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది. ఆ తర్వాత నిర్మాత ఠాగూర్ మధు ఫిర్యాదుతో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఈ వివాదాన్ని పరిష్కరించి క్రాక్ సినిమాకు థియేటర్లు ఇప్పించింది.

GOPICHAND MALINENI COMPLAINANT ON MADHU

ఈ క్రమంలో తాజాగా క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు మరో వివాదంలో చిక్కుకున్నారు. క్రాక్ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్‌ను ఠాగూర్ మధు ఇవ్వలేదంటూ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాడు. దీనిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన పెండింగ్ రెమ్యూనరేషన్ ఇప్పించేలా చేయాలని కోరాడు. గోపీచంద్ మలినేని ఫిర్యాదు అందుకున్న డైరెక్టర్స్ అసోసియేషన్.. దీనిపై చర్యలు చేపడుతోంది. కాగా సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ బ్లాక్ బస్టర్ విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సంపాదించుకుంది. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా ఇది నిలవగా.. అంతేకాకుండా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే వివాదాస్పదాల పరంగా కూడా ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే ఇబ్బందులు ఎదర్కొన్న సినిమాగా నిలిచింది. ప్రొడ్యూసర్, డైరెక్టర్ మధ్య సమస్యలు, డిస్ట్రిబ్యూటర్‌, దిల్ రాజు మధ్య గొడవల వల్ల రవితేజ కెరీర్‌కు ఈ సినిమా వల్ల ఇబ్బంది జరుగుతోంది. రవితేజ తన కెరీర్‌లోనే ఈ సినిమాకు ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ సినిమాకు ఎదుర్కొలేదు.